AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభిన౦దన్ రాగానే జరిగే ప్రక్రియలు

వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్థాన్ భారత్‌కు అప్పగించనుంది. అతని కోసం వాఘా సరిహద్దు దగ్గర అధికారులు, ప్రజలు వేచి చూస్తున్నారు. అయితే అతడు భారత్‌లో అడుగు పెట్టగానే చాలా పెద్ద ప్రక్రియనే పూర్తి చేయాల్సి ఉంటుంది. మళ్లీ అతడు సాధారణ జీవితం గడపటానికి కొంత సమయం పడుతుంది. యుద్ధ ఖైదీ తిరిగి స్వదేశానికి వస్తున్నపుడు అనుసరించే ప్రక్రియను ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇదీ పూర్తి ప్రక్రియ 1. అభినందన్ ఇండియాలో అడుగుపెట్టగానే అతన్ని నేరుగా ఇండియన్ […]

అభిన౦దన్ రాగానే జరిగే ప్రక్రియలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 01, 2019 | 5:50 PM

Share

వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్థాన్ భారత్‌కు అప్పగించనుంది. అతని కోసం వాఘా సరిహద్దు దగ్గర అధికారులు, ప్రజలు వేచి చూస్తున్నారు. అయితే అతడు భారత్‌లో అడుగు పెట్టగానే చాలా పెద్ద ప్రక్రియనే పూర్తి చేయాల్సి ఉంటుంది. మళ్లీ అతడు సాధారణ జీవితం గడపటానికి కొంత సమయం పడుతుంది. యుద్ధ ఖైదీ తిరిగి స్వదేశానికి వస్తున్నపుడు అనుసరించే ప్రక్రియను ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

ఇదీ పూర్తి ప్రక్రియ

1. అభినందన్ ఇండియాలో అడుగుపెట్టగానే అతన్ని నేరుగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు తీసుకెళ్తారు. 2. అతని ఫిట్‌నెస్ స్థాయి తెలుసుకోవడానికి కొన్ని వైద్య పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది 3. పాకిస్థాన్ ఆర్మీ అతని శరీరంలో ఏమైనా ఉంచిందా అన్నది తెలుసుకోవడానికి వివిధ స్కాన్‌లు నిర్వహిస్తారు 4. ఇక అభినందన్‌కు మానసిక పరీక్షలు కూడా నిర్వహిస్తారు. శత్రువుల చెరలో అతను ఉండటం, కొన్ని రోజుల పాటు షాక్‌లో గడపడం వల్ల శత్రు దేశం మన రహస్యాలను తెలుసుకోవడానికి అతన్ని హింసించిందా అన్నది ఈ పరీక్షల ద్వారా చూస్తారు. 5. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కూడా అతన్ని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.

అన్నింటికన్నా ముఖ్యంగా తన మిషన్ గురించి సమాచారం శ‌త్రువుల‌కు ఇచ్చాడా లేదా అన్నది అభినందన్ నుంచి రాబడతారు. ఐఏఎఫ్ ఇంటెలిజెన్స్ ఈ పని చేస్తుంది. అతను పాకిస్థాన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుసు కాబట్టి.. ఓ ప్రామాణిక ప్రక్రియను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని ఆ అధికారి స్పష్టం చేశారు. ఒకవేళ అభినందన్ తన శారీరక, మానసిక ఫిట్‌నెస్‌ను నిరూపించకపోతే.. భవిష్యత్తులో అతడు ఆఫీస్ పనికే పరిమితం కావాల్సి ఉంటుందని ఆ అధికారి చెప్పడం కొసమెరుపు.

Follow Us
పెళ్లికూతురుగా ముస్తాబై వస్తుందనుకుంటే.. శవమై ఇంటికి..!
పెళ్లికూతురుగా ముస్తాబై వస్తుందనుకుంటే.. శవమై ఇంటికి..!
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..