AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lose Belly Fat Tips: మీ పొట్ట ఐసు గడ్డలా కరగాలి అంటే ఈ సీక్రెట్ వెయిట్ లాస్ డ్రింక్ తాగండి..

శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్‌ను తగ్గించుకోవడం చాలామందికి పెద్ద సవాలుగా మారుతుంది. అయితే, మన వంటగదిలో ఉండే కొన్ని సాధారణ దినుసులతో ఇంట్లోనే ఒక అద్భుతమైన వెయిట్ లాస్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో, దాంతో పాటు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో ప్రముఖ నిపుణులు డాక్టర్ చేతన్ రాజ్ మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం.

Phani CH
|

Updated on: Jun 28, 2026 | 8:56 PM

Share
నేటి ఆధునిక కాలంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం మొదటి వరుసలో ఉంటాయి. ఎన్ని డైట్లు చేసినా, జిమ్‌లకు వెళ్లినా బరువు తగ్గట్లేదని బాధపడేవారి సంఖ్య తక్కువేమీ కాదు. అయితే, ఎటువంటి అండర్లైయింగ్ ఆరోగ్య సమస్యలు (బీపీ, షుగర్ వంటివి) లేదా మందుల సైడ్ ఎఫెక్ట్స్ లేకపోయినా బరువు తగ్గట్లేదంటే, దానికి ప్రధాన కారణం మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకోవడమే. బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులతో పాటు, ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఒక మేజికల్ వెయిట్ లాస్ డ్రింక్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుందని డాక్టర్ చేతన్ రాజ్ వివరిస్తున్నారు.

1 / 5
సగం డైట్ సూత్రం: బరువు తగ్గాలనుకునే వారు ముందుగా చేయాల్సింది తమ ఆహార పరిమాణాన్ని సగం చేయడం. ఉదాహరణకు, మీరు ఉదయం పూట ఏడు ఇడ్లీలు తినే అలవాటు ఉంటే, దాన్ని మూడున్నరకు తగ్గించాలి. మధ్యాహ్నం ఒక బౌల్ రైస్ తినే బదులు హాఫ్ బౌల్ మాత్రమే తినాలి. రాత్రి పూట జొన్న రొట్టెలు ఎక్కువగా తినే అలవాటు ఉంటే, కేవలం ఒక్కటి మాత్రమే తినాలి. జొన్న రొట్టెలు తింటే బరువు తగ్గుతారు కదా అని ఎక్కువ మొత్తంలో తింటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి, ఆహారం ఏదైనా సరే పరిమాణం తగ్గించడం చాలా ముఖ్యం.

2 / 5
నడక టార్గెట్: సాధారణంగా రోజుకు 10,000 అడుగులు నడవాలని చాలా యాప్స్ చెప్తుంటాయి, కానీ అందరి స్టామినా ఒకేలా ఉండదు. అందుకే రోజువారీ అడుగుల కంటే, నెలకు 100 కిలోమీటర్లు నడవాలనే టార్గెట్ పెట్టుకోవడం మంచిది. అంటే రోజుకు సుమారు 3 కిలోమీటర్లు అన్నమాట. మీడియం పేస్‌తో నడిస్తే కేవలం 20 నుండి 30 నిమిషాలలోనే 3 కిలోమీటర్ల నడక పూర్తవుతుంది. ఇది మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి కూడా పెద్ద శ్రమగా అనిపించదు.

3 / 5
ఫ్యాట్ బర్నింగ్ మేజికల్ డ్రింక్ తయారీ: మన వంటగదిలో ఉండే నాలుగు ముఖ్యమైన దినుసులతో ఈ వెయిట్ లాస్ మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం అర చెంచా జీలకర్ర, అర చెంచా సోంపు, అర చెంచా వాము మరియు అర చెంచా ధనియాలు తీసుకోవాలి. ఈ నాలుగింటిని రోస్ట్ చేయకుండానే రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. రాత్రి పూట నీటిని బాగా మరిగించి, అందులో ఈ దంచిన పొడిని వేసి మూతపెట్టి రాత్రంతా అలాగే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే ఈ నీటిని వడకట్టుకుని పరగడుపున తాగాలి.

4 / 5
 ఈ డ్రింక్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తాయి, లివర్ మరియు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి, అలాగే శరీరంలో నీరు చేరి కాళ్లు ఉబ్బే సమస్యను తగ్గిస్తాయి. ఈ హోమ్ రెమెడీతో పాటు జంక్ ఫుడ్స్ మానేసి, రాత్రి పూట ఓటీటీల కోసం నిద్ర పాడు చేసుకోకుండా సమయానికి పడుకుంటే, కేవలం కొద్ది రోజుల్లోనే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగి శరీరం నాజూగ్గా మారుతుంది.

5 / 5
Follow Us
మీ పొట్ట ఐసు గడ్డలా కరగాలి అంటే ఈ సీక్రెట్ డ్రింక్ తాగండి

వీటిని సరైన విధంగా తింటున్నారా? ఇలా తింటేనే పూర్తి ప్రయోజనం

పెళ్లి రోజు వాన పడితే ఆ దంపతుల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా?

చిక్కటి గ్రేవీతో నోరూరించే మటన్ పాయ.. అస్సలు తినాల్సింది ఇప్పుడే

ఇంట్లోనే టేస్టీ టేస్టీ పిజ్జా సాస్.. ఎలా తయారు చేయాలో తెలుసా?

కేవలం నీటితో కడిగితే సరిపోదు..పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయండి

బిర్యానీ, పులావ్‌ల్లోకి అదిరిపోయే హైదరాబాదీ దాల్చా..

రెట్రో లుక్‌, లేటెస్ట్‌ ఫీచర్లతో కొమోడోర్‌‌ ఫ్లిప్‌ ఫోన్‌

అమెరికాలో ఆంధ్ర కుర్రాడు మిస్సింగ్.. అసలు ఏం జరిగిందంటే?

అందరికీ సహాయం చేయొద్దు.. ఇలాంటి వ్యక్తులకు మేలు చేస్తే మీకే నష్టం