ఇవాళ అక్కడ ఒక్క కరోనా కేసు నమోదు కాలేదట..!
కరోనా పుట్టినిల్లు చైనాలో ఇవాళ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆ దేశ అధికారులు ప్రకటించారు. ఇంతకాలం చైనాలో ఎదో ఒక చోట కరోనా వెలుగు చూస్తున్నప్పటికీ ఇది కూడా రికార్డుగా చెప్పుకుంటోంది డ్రాగన్ కంట్రీ.
కరోనా పుట్టినిల్లు చైనాలో ఇవాళ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆ దేశ అధికారులు ప్రకటించారు. ఇంతకాలం చైనాలో ఎదో ఒక చోట కరోనా వెలుగు చూస్తున్నప్పటికీ ఇది కూడా రికార్డుగా చెప్పుకుంటోంది డ్రాగన్ కంట్రీ.
చైనా రాజధాని బీజింగ్‌లో గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఆ దేశ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఇటీవల బీజింగ్‌లో కరోనా మహమ్మారి మరోమారు వెలుగుచూసింది. జూన్ 11న ఓ హోల్‌సేల్ ఫుడ్ మార్కెట్‌లో కొత్తగా కేసులు బయటపడ్డాయి. దీంతో చైనా ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. బీజింగ్‌లో మరోమారు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధించింది. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. తెరిచిన స్కూళ్లను సైతం మూసివేసి కట్టడి చేసింది. కరోనా వ్యాప్తి చెందకుండా పక్కాగా జాగ్రత్తలు తీసుకున్నారు స్థానిక అధికారులు. రెండో క్లస్టర్‌లో భాగంగా మొత్తంగా ఈ ప్రాంతంలో 335 కేసులు బయటపడినట్టు హెల్త్ కమిషన్ తెలిపింది. ఇందులో 15 మంది పూర్తిగా కోలుకోగా.. 320 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఇక, ఎలాంటి కరోనా లక్షణాలు లేని 31 మందిని క్వారంటైన్ ఉంచి వైద్యులు
ఇదిలావుంటే, చైనా వ్యాప్తంగా మంగళవారం ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం 83,565 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు 78,528 మంది కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోగా.. 4,634 మంది చనిపోయినట్లు చైనా హెల్త్ కమిషన్ వెల్లడించింది.