AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్నాబ్ గోస్వామిపై దాడి ఘటన.. దుండగుల అరెస్ట్.. కాంగ్రెస్ పనేనంటున్న జర్నలిస్ట్

రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి దంపతులపై జరిగిన దాడి ఘటనలో ముంబై పోలీసులు ఇద్దరు దుండగులను అరెస్టు చేశారు. బుధవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో తాము కారులో ఇంటికి వెళ్తుండగా.. తమపై ఎటాక్ జరిగిందని అర్నాబ్ పోలీసులకు ఇఛ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు,...

అర్నాబ్ గోస్వామిపై దాడి ఘటన.. దుండగుల అరెస్ట్.. కాంగ్రెస్ పనేనంటున్న జర్నలిస్ట్
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 23, 2020 | 12:23 PM

Share

రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి దంపతులపై జరిగిన దాడి ఘటనలో ముంబై పోలీసులు ఇద్దరు దుండగులను అరెస్టు చేశారు. బుధవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో తాము కారులో ఇంటికి వెళ్తుండగా.. తమపై ఎటాక్ జరిగిందని అర్నాబ్ పోలీసులకు ఇఛ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు, టూ వీలర్ పై వఛ్చిన దుండగుల్లో ఒకడు తమ కారు అద్దాలు ధ్వంసం చేయగా.. వెనుక కూర్చున్న వ్యక్తి తన జేబులో నుంచి ఏదో లిక్విడ్ తీసి డ్రైవింగ్ సీటులో ఉన్న తనపై చల్లాడని ఆయన తెలిపారు. అయితే ఈ దాడిలో తాము గాయపడలేదన్నారు. తమపై జరిగిన ఈ ఘటనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా ఈ ఎటాక్ జరిగిన మూడు గంటలకే ట్వీట్ చేశారని ఆయన అన్నారు. అటు- మహారాష్ట్రలోని పాల్గర్ లో ఇద్దరు సాధువులు, ఒక డ్రైవర్ ను స్థానికులు కొట్టి చంపిన ఉదంతానికి మతం రంగు పులమడానికి యత్నించారని అర్నాబ్ గోస్వామిపై కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నితిన్ రౌత్ అనే ఆ పార్టీ నేత నాగ పూర్ లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆ తరువాత అర్నాబ్ వెల్లడించారు. ఇదంతా చూస్తే కావాలని కాంగ్రెస్ పార్టీ తనను  పాల్గర్ ఘటనతో ముడి పెట్టి అప్రదిష్ట పాల్జేయడానికి ప్రయత్నిస్తోందన్నారు.

ఇలా ఉండగా.. అర్నాబ్ పై దాడిని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, బీజేపీ అధ్యక్ధుడు జె.పీ. నడ్డా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుధ్ధమని, సహనంతో ఉండాలని బోధించే వారే అసహనంతో ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నారని జవదేకర్ ఆరోపించారు. జె.పీ. నడ్డా సైతం ఒక ప్రకటనలో.. కాంగ్రెస్ పార్టీ నైరాశ్యానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.