ప్రవాస తెలంగాణవాసులకు కేసీఆర్ బిగ్ షాక్

ప్రవాస తెలంగాణవాసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బిగ్ షాక్ ఇచ్చారు. విదేశాలలో వున్న తెలంగాణవాసులను పక్కన పెడితే.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వున్న తెలంగాణ వాసులు తమ స్వస్థలాలకు రావాలంటే సుదీర్ఘ క్వారెంటైన్‌కు సిద్దపడితేనే రావాలని షరతు విధించారు.

ప్రవాస తెలంగాణవాసులకు కేసీఆర్ బిగ్ షాక్
Follow us

|

Updated on: Apr 22, 2020 | 5:14 PM

ప్రవాస తెలంగాణవాసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బిగ్ షాక్ ఇచ్చారు. విదేశాలలో వున్న తెలంగాణవాసులను పక్కన పెడితే.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వున్న తెలంగాణ వాసులు తమ స్వస్థలాలకు రావాలంటే సుదీర్ఘ క్వారెంటైన్‌కు సిద్దపడితేనే రావాలని షరతు విధించారు. అది కూడా 14 రోజుల క్వారెంటైన్‌కు కాకుండా ఏకంగా 28 రోజుల క్వారెంటైన్‌కు సిద్దపడితేనే తెలంగాణకు రావాలని వివిధ రాష్ట్రాల్లో వుండిపోయిన తెలంగాణవాసులకు తేల్చి చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం.

కరోనా నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. లాక్ డౌన్ ఎంత కఠినంగా అమలు చేస్తున్నా కూడా వైరస్ వ్యాప్తి పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. దానికి తోడు ఇంకెన్నాళ్ళు లాక్ డౌన్ సమస్యలంటూ జనం గళమెత్తడం ప్రారంభమైంది. మరోవైపు తమ స్వస్థలాలకు రాకుండా ఇంకెంతకాలం తాము దూరంగా వుండాలని పలువురు తెలంగాణ వాసులు వివిధ రాష్ట్రాల నుంచి పలు మాధ్యమాల ద్వారా కేసీఆర్ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి వచ్చినా.. ఇతర దేశాల నుంచి వచ్చినా …ఎవరైనా సరే.. ఎప్పుడైనా సరే.. తెలంగాణ గడ్డపై కాలుపెడితే ఇకపై క్వారంటైన్‌లో 28 రోజులు తప్పనిసరిగా ఉండాల్సిందేనని కేసీఆర్ నిర్ణయించారు. ఇంతకు ముందు క్వారెంటైన్ పీరియడ్ కేవలం 14 రోజులు మాత్రమే వుండేది. 14 రోజుల క్వారంటైన్‌లో ఉంటే చాలు.. ఇప్పుడు ఈ గడువును 28 రోజులకు పెంచారు. అంతే కాకుండా ఇక నుంచి ప్రైమరీ కాంటాక్టులకే పరీక్షలు చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.

Latest Articles