ఏపీలోని ఆ ఐదు బస్టేషన్లు పూర్తిగా మారిపోనున్నాయి

ఆర్టీసీ బస్‌స్టేషన్ల ఆధునికీకరణపై  ఏపీఎస్‌ ఆర్టీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసీ బస్‌స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వాటిని ఇంటిగ్రేటెడ్‌ స్టేషన్లుగా మార్చేందుకు నిర్ణయించింది.

ఏపీలోని ఆ ఐదు బస్టేషన్లు పూర్తిగా మారిపోనున్నాయి
Follow us

|

Updated on: Sep 10, 2020 | 2:42 PM

ఆర్టీసీ బస్‌స్టేషన్ల ఆధునికీకరణపై  ఏపీఎస్‌ ఆర్టీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసీ బస్‌స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వాటిని ఇంటిగ్రేటెడ్‌ స్టేషన్లుగా మార్చేందుకు నిర్ణయించింది. రూ.150 కోట్ల వ్య‌యంతో దీన్ని నిర్మించ‌నున్నారు. ఆయా బస్‌స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలతోపాటు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, సినిమా హాళ్లను నిర్మించనుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని కీలక బస్టాండుల్లో అంతర్జాతీయ ప్రమాణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా మ‌రో 21 బస్‌స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.  పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యంతో ఐదు జిల్లాల్లో ఏడు చోట్ల బస్‌ స్టేషన్లను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆర్కిటెక్చరల్‌ కన్సల్టెంట్‌ ఎంపిక కోసం ఆర్టీసీ ఇటీవలే టెండర్లను కూడా పిలిచింది. ప్ర‌స్తుతానికి మొత్తం ఐదు జిల్లాల్లో ఆర్టీసీ స్థలాలను కమర్షియల్‌ కాంప్లెక్స్‌లుగా మారుస్తారు. వీటిలో విజయవాడ, చిత్తూరు, విశాఖ, గుంటూరు జిల్లాలను ఎంపిక చేసింది. విశాఖ, గుంటూరు, కృష్ణా జిల్లాలో రెండు స్టేషన్లు.. చిత్తూరు జిల్లాలో ఒక స్టేషన్‌ను ఎంపిక చేశారు.

వాటిలో ఆటోనగర్‌– విజయవాడ, హనుమాన్‌ జంక్షన్‌ (కృష్ణా), తిరుపతి (చిత్తూరు), మద్దిలపాలెం, నర్సీపట్నం (విశాఖ), కర్నూలు, నరసరావుపేట (గుంటూరు) ప్రాంతాల‌ను ఇందుకు ఎంపిక చేశారు. ఒక్కో బస్టాండ్‌ను రూ.10 కోట్ల నుంచి రూ.25కోట్ల వ‌ర‌కు కేటాయించ‌నున్నారు. ఈ మోడ్రన్ బస్ స్టేషన్లలో వైఫై సదుపాయం, మరుగుదొడ్ల విస్తరణ, రీ–పెయింటింగ్, ర్యాంపులు, రైయిలింగ్‌ల నిర్మాణం, డిజిటల్‌ డిస్‌ ప్లే బోర్డులు తదితర సౌకర్యాలు ఉండ‌నున్నాయి. అంతేకాకుండా శ్రీకాకుళం, విజయనగరం,, కాకినాడ స‌హా ప‌లు ప్రాంతాల్లో బ‌స్‌స్టేష‌న్ల‌ను అప్‌గ్రేడ్ చేయ‌నున్నారు.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..