బ్రేకింగ్: ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైం టేబుల్ రిలీజ్..
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ఇంట్మీడియట్ బోర్డు. జులై 11 నుంచి 18 వరకు ఈ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఉండనున్నాయని పేర్కొంది. పరీక్షలకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని...
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ఇంట్మీడియట్ బోర్డు. జులై 11 నుంచి 18 వరకు ఈ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఉండనున్నాయని పేర్కొంది. పరీక్షలకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని వెల్లడించింది ఇంటర్ బోర్డు. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. విద్యార్థుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. ఎవరూ భయపడవద్దని పేర్కొంది ఇంటర్ బోర్డు. అలాగే విద్యార్థులు కూడా మాస్కులు ధరిస్తూ.. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరింది.
కాగా ప్రస్తుతం ఏపీలో.. కొత్తగా 304 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 246 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన 52 మంది, విదేశాలకు చెందినవారు 8 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా ఇద్దరు కరోనాతో చనిపోయారు. కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు మరణించారు. 47మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5087కి చేరింది. ఇప్పటివరకు 2770 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2231. ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య 86కి పెరిగింది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
Read More:
కాణిపాకంలో కరోనా కలకలం.. హోమ్ గార్డ్‌కి పాజిటివ్..
బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల కఠిన నిర్ణయం.. వారందరికీ నగర బహిష్కరణ..