ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ… హైకోర్టు తీర్పుపై ఎదురు చూపులు

పరిషత్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ వేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.

ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ... హైకోర్టు తీర్పుపై ఎదురు చూపులు
Ap High Court
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 07, 2021 | 11:54 AM

ap mptc zptc elections 2021: ఆంధ్రప్రదేశ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఓ వైపు గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంటే, మరోవైపు పోలింగ్ ఉంటుందా లేదా అన్నదానిపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.

పరిషత్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ వేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్ తరపున సీనియర్ న్యాయవాది సీవీ మోహనరెడ్డి వాదనలు వినిపించారు.. ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం ఎస్ఈసీదేనని వివరించారు. పోలింగ్‌కు ముందు నాలుగు వారాలు కోడ్ ఉండాలనే నిబంధన లేదన్నారు. ఎస్ఈసీ తరపున వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. ఎన్నికల కమిషన్ సరైన వివరాలు అందించలేదని అభిప్రాయపడింది. విచారణను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేయగా.. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై అందరి చూపు పడింది.

హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా… పోలింగ్‌ సిబ్బంది మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల సామాగ్రి పంపిణీ మొదలైంది. ఒకవేళ స్టే కొనసాగితే సిబ్బందిని వెనక్కి పంపిస్తారు. పోలింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ వస్తే పూర్తి స్థాయిలో సామాగ్రిని అందిస్తారు. విజయవాడ దగ్గరున్న కంకిపాడులో పోలింగ్‌ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

Read Also…  భారతీయ అత్యంత ధనవంతుల జాబితా విడుదల.. అగ్రస్థానంలో ముఖేష్, రెండో స్థానంలో అదాని