AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయ అత్యంత ధనవంతుల జాబితా విడుదల.. అగ్రస్థానంలో ముఖేష్, రెండో స్థానంలో అదాని

ఈ ఏడాది మనదేశానికి సంబంధించిన అత్యంత ధనవంతుల జాబితాను ప్రముఖ సంస్థ ఫోర్బ్స్ విడుదల చేసింది. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు.

భారతీయ అత్యంత ధనవంతుల జాబితా విడుదల.. అగ్రస్థానంలో ముఖేష్, రెండో స్థానంలో అదాని
Forbes 10 Richest Indian Billionaires 2021 List
Balaraju Goud
|

Updated on: Apr 07, 2021 | 11:41 AM

Share

Top 10 richest Indian:  కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. లాక్‌డౌన్ కారణంగా వర్తక, వాణిజ్యం, ఉత్పాదక రంగంతో పాటు అన్ని వ్యవస్థలు కుంటుపడ్డాయి. అయినప్పటికీ జాతీయ స్టాక్ మార్కెట్ మాత్రం పరుగులు పెడుతుంది. ఈ ఏడాది మనదేశానికి సంబంధించిన అత్యంత ధనవంతుల జాబితాను ప్రముఖ సంస్థ ఫోర్బ్స్ విడుదల చేసింది. తాజా లెక్కల ప్రకారం భారతీయ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు.

మరోవైపు ఈ ఏడాది ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా మరింత పెరిగింది. గత ఏడాది 102 మంది ఉండగా అది ఈసారి 142కి చేరింది. వీరి సంపద 596బిలియన్ డాలర్లుగా ఉంది. గ్యాస్, టెలికామ్ రంగాల్లో విపరీతమైన వృద్ధి రేటు అందుకున్న ముకేష్ అంబానీ ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ 84.5బిలియన్ డాలర్లుగా ఉంది.

దేశంలో అత్యంత ధనవంతుల జాబితా ఇలా ఉంది…

1. ముకేష్ అంబానీ సంపద విలువ: 84.5 బిలియన్ డాలర్లు వ్యాపారం: వివిధ రంగాలు. నివాసం: ముంబై

2. గౌతమ్ అదాని సంపద: 50.5 బిలియన్ డాలర్లు వ్యాపారం: నిర్మాణ రంగం. నివాసం: అహమ్మదాబాద్.

3. శివ్ నాడార్ సంపద: 23.5 బిలియన్ డాలర్లు వ్యాపరం: సాఫ్ట్‌వేర్ సేవలు నివాసం: ఢిల్లీ

4. రాధాక్రిష్ణ దామాని. సంపద:16.5 బిలియన్ డాలర్లు వ్యాపారం: రిటైల్ (డీమార్ట్ అధినేత) నివాసం: ముంబై

5. ఉదయ్ కోటక్ సంపద: 15.9 బిలియన్ డాలర్లు వ్యాపారం: బ్యాంకింగ్ (కోటక్ మహింద్రా బ్యాంక్) నివాసం: ముంబై

6. లక్ష్మీ మిట్టల్ సంపద: 14.9 బిలియన్ డాలర్లు వ్యాపారం: స్టీల్ నివాసం: లండన్.

7. కుమార మంగళం బిర్లా సంపద: 12.8 బిలియన్ డాలర్లు వ్యాపారం: కమాడిటీస్ నివాసం ముంబై

8. సైరస్ పూనంవాలా సంపద: 12.7 బిలియన్ డాలర్లు వ్యాపారం: ఫార్మా (సీరమ్ ఇంస్టిట్యూట్ అధినేత) నివాసం: పుణె

9. దిలీప్ సంఘ్వీ సంపద:10.9 బిలియన్ డాలర్లు వ్యాపారం: ఫార్మా నివాసం: ముంబై

10. సునీల్ మిట్టల్ సంపద: 10.5 బిలియన్ డాలర్లు వ్యాపారం: టెలికామ్ నివాసం: ఢిల్లీ

Read Also… Karnataka Bus strike: కదలని చక్రాలు.. ఆగిన బస్సులు.. కేఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె.. సమస్యల పరిష్కారానికి డిమాండ్