AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యవసాయం రంగంపై సీఎం జగన్‌ సమీక్ష.. చిన్న రైతుల మేలుపై దృష్టి.. అధికారులకు ఏం చెప్పాడంటే..?

CM Jagan Review Agriculture Sector : వ్యవసాయ రంగం దాని అనుబంధ సంస్థలపై ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిన్న సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొని

వ్యవసాయం రంగంపై సీఎం జగన్‌ సమీక్ష.. చిన్న రైతుల మేలుపై దృష్టి.. అధికారులకు ఏం చెప్పాడంటే..?
AP farmers
uppula Raju
|

Updated on: Apr 07, 2021 | 5:13 AM

Share

CM Jagan Review Agriculture Sector : వ్యవసాయ రంగం దాని అనుబంధ సంస్థలపై ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిన్న సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొని అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా హార్టికల్చర్‌, మైక్రో ఇరిగేషన్, అగ్రి ఇన్‌ఫ్రాలపై చర్చించారు. అనంతరం మీడియాకు పలు విషయాలను వెల్లడించారు.

నిర్ణీత కాలంలోగా చిన్న, సన్నకారు రైతులందరికీ కూడా డ్రిప్, స్ప్రింక్లర్‌ సదుపాయాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. దీని వల్ల చిన్న, సన్నకారు రైతులందరికీ డ్రిప్, స్ప్రింక్లర్‌ సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించినట్టు అవుతుందని తెలిపారు. ఎలాగూ బోర్లు వేయిస్తున్నాం కాబట్టి వారికి సూక్ష్మ సేద్యం సదుపాయాలను ఇచ్చినట్లైతే మంచి ఫలితాలు వస్తాయని ఆకాక్షించారు. కొందరికి మాత్రమే పథకాలు ఉండకూడదు అందరికీ అందాలని అధికారులకు గుర్తు చేశారు.

సూక్ష్మసేద్యం సదుపాయాలను రివర్స్‌టెండరింగ్‌ పద్దతిలో కొనుగోలు చేయడం ద్వారా రేటు తగ్గుతుందన్నారు. దీనివల్ల ఎక్కువ మంది రైతులకు సూక్ష్మ సేద్యం సదుపాయాలను అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.సెరికల్చర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మల్బరీ రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. అగ్రి ఇన్‌ఫ్రాలో భాగంగా ఏర్పాటు చేయనున్న మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లపై సీఎం జగన్‌ చర్చించారు.

ఇందులో భాగంగా డ్రై స్టోరేజీ, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ ఫాం, గోడౌన్లు, హార్టికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ప్రాససింగ్‌ సెంటర్లు, యంత్రపరికరాలు, ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు, ఇ–మార్కెటింగ్, జనతాబజార్లు, ప్రైమరీ ప్రాససింగ్‌ యూనిట్లు తదితర 14 సదుపాయాల గురించి మాట్లాడారు. అధికారులు ఎటువంటి పొరపాట్లు చేయకుండా రైతులకు అన్ని విధాల సహాయసహకారాలు అందించాలని ఆదేశించారు.

Narang set to Marry: ఓ ఇంటివాడు కాబోతున్న స్టార్​ షూటర్​ గగన్ నారంగ్​.. 21న హైదరాబాద్‌లోని ఒక స్టార్‌ హోటల్లో వివాహం

వైసీపీ సర్కారుకి హైకోర్టు తీర్పు చెంపపెట్టన్న బాబు, ఎన్నికల సంఘం ప్రభుత్వానికి రబ్బరు స్టాంపులా మారకూడదని హితవు

పీపీఈ కిట్‌లో వచ్చి ఓటేసిన ఎంపీ కనిమొళి.. మీడియాకు విజయ సంకేతం చూపించి తిరిగి అంబులెన్స్‌లోకి..