ఇడుపులపాయకు చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన ఆయన కడప విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ ముఖ్యమంత్రికి మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ హరికిరణ్ తో సహా పలువురు అధికారులు, నేతలు ఘనస్వాగతం పలికారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన ఆయన కడప విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ ముఖ్యమంత్రికి మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ హరికిరణ్ తో సహా పలువురు అధికారులు, నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం నేరుగా ఇడుపులపాయకు బయలుదేరారు. కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి ఇడుపులపాయకు చేరుకున్నారు. బుధవారం దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సాఆర్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతితో పాటు కుటుంబసభ్యలు నివాళులర్పించనున్నారు. అనంతరం ట్రిపుల్ ఐటీ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం జగన్ అవిష్కరించనున్నారు. అనంతరం కడప జిల్లాలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. తిరిగి బుధవారం సాయంత్రం అమరావతికి చేరుకోనున్నారు.