అఖిల ప్రియ భర్త బెదిరింపులు: పోలీస్ కేస్ నమోదు

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్‌పై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఇండస్ట్రీ ఓనర్‌ను భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ బెదిరిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఆళ్లగడ్డ పీఎస్‌లో పోలీస్ కేసు నమోదు చేశారు సదరు ఇండస్ట్రీ ఓనర్ శివరామిరెడ్డి. కర్నూలు జిల్లాలోని దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి అనే వ్యక్తి .. నగర శివారులో శ్రీ లక్ష్మీ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:09 pm, Thu, 3 October 19
అఖిల ప్రియ భర్త బెదిరింపులు: పోలీస్ కేస్ నమోదు

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్‌పై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఇండస్ట్రీ ఓనర్‌ను భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ బెదిరిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఆళ్లగడ్డ పీఎస్‌లో పోలీస్ కేసు నమోదు చేశారు సదరు ఇండస్ట్రీ ఓనర్ శివరామిరెడ్డి.

కర్నూలు జిల్లాలోని దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి అనే వ్యక్తి .. నగర శివారులో శ్రీ లక్ష్మీ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో అఖిల ప్రియకు కూడా 40 శాతం ఉంది. భార్గవ్ రామ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత దానిపై అతనికి హక్కు వచ్చింది. అయితే.. బిజినెస్‌కి సంబంధించి గత కొంతకాలంగా.. అఖిల ప్రియకు, శివరామి రెడ్డికి గొడవలు జరుగుతోన్నాయి. ఈ క్రమంలో.. భార్గవ్.. ఫ్యాక్టరీకి తాళం వేసి.. శివరామిరెడ్డిని బెదిరించినట్టు.. అతని భార్య మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. అఖిల ప్రియపై కేసు నమోదైంది. కాగా.. ఈవిషయంపై అఖిల ప్రియ కానీ.. వారి బంధువులు కానీ స్పందించలేదు.