AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి కెసీఆర్ అడుగుజాడల్లో జగన్.. ఎక్కడంటే..?

ఒక్క రోజు తేడాలో ప్రధాన మంత్రితో ఇద్దరు తెలుగు సీఎంల భేటీ. కెసీఆర్ వెళుతున్నారనగానే ఏపీ సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళుతున్నారు.. కెసీఆర్ ప్రధానిని కలిసిన మర్నాడే జగన్ కూడా ప్రధానితో భేటీ కాబోతున్నారు. నిజానికి ఇద్దరు సీఎంలు తమ తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ప్రధాన మంత్రిని కల్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. దేశంలోని ప్రతీ ముఖ్యమంత్రి చేసే పనే అది. కానీ కెసీఆర్, జగన్ వెళుతున్నారు అనగానే.. అదే పెద్ద చర్చనీయాంశమైంది తెలుగు […]

మరోసారి కెసీఆర్ అడుగుజాడల్లో జగన్.. ఎక్కడంటే..?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 03, 2019 | 2:10 PM

Share

ఒక్క రోజు తేడాలో ప్రధాన మంత్రితో ఇద్దరు తెలుగు సీఎంల భేటీ. కెసీఆర్ వెళుతున్నారనగానే ఏపీ సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళుతున్నారు.. కెసీఆర్ ప్రధానిని కలిసిన మర్నాడే జగన్ కూడా ప్రధానితో భేటీ కాబోతున్నారు. నిజానికి ఇద్దరు సీఎంలు తమ తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ప్రధాన మంత్రిని కల్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. దేశంలోని ప్రతీ ముఖ్యమంత్రి చేసే పనే అది. కానీ కెసీఆర్, జగన్ వెళుతున్నారు అనగానే.. అదే పెద్ద చర్చనీయాంశమైంది తెలుగు రాష్ట్రాలలో.

కెసీఆర్ పర్యటన వివరాలు వెల్లడైన కొన్ని గంటల్లోనే జగన్ ఢిల్లీ టూర్ వివరాలను ప్రకటించారు. అదేంటి ఈయన వెళ్ళగానే ఆయనా వెళ్ళడమేంటి ? ఇది నెటిజన్లు సోషల్ మీడియాలో వేస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజానికి ఇద్దరి ఎజెండాలు వేర్వేరు. కాకపోతే కామన్ పాయింట్లు ఒకటో, రెండో వుంటాయి. అంతే.. అవే ఎంటనీ చూస్తే వెల్లడైన అంశాలు ఇవి.

కెసీఆర్ బాటలో వెళ్ళినా.. లేక ముందుగానే అనుకుని ఢిల్లీ వెళ్ళినా.. ప్రధాని ముందు జగన్ వుంచబోయే ఎజెండా మాత్రం ముందుగానే ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నివేదికలతో  రెడీ అయిన జగన్.. ప్రధాని ముందుంచబోయే అంశాలు ఇవే..

(1) పెండింగ్ లో వున్న విభజన అంశాలను పూర్తి చేయాలి

(2) పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరించాలి.

(3) రివర్స్ టెండరింగ్ కు వెళ్ళిన కారణాలను వివరించి సహకారం కోరాలి.

(4) పిపిఏల రివ్యూపై కేంద్ర, రాష్ట్రాల మధ్య వున్న అభిప్రాయ భేదాలపై క్లారిటీ ఇవ్వడం.

(5) గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించడం ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం కోరడం.

(6) రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని కోరడం.

వీటిలో గోదావరి, కృష్ణా జలాల అనుసంధానం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాబట్టి కెసీఆర్, జగన్ లిద్దరూ వేర్వేరుగా ప్రధానితో ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి.