పఠాన్‌కోట్‌ తరహా దాడులకు ఉగ్రవాదుల స్కెచ్..!

దేశ వ్యాప్తంగా ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు స్కెచ్ వేస్తున్నారు. గతంలో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లపై దాడిచేసిన విధంగా.. మరోసారి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది నుంచి పది మంది ఉగ్రవాదులతో కూడిన జైషే ఉగ్ర మాడ్యూల్ ఒకటి ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో పంజాబ్‌లోని అమృత్ సర్, పఠాన్‌కోట్, జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎయిర్‌బేస్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీనగర్‌, అవంతిపూర్‌, జమ్ము, పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ల […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:10 pm, Thu, 3 October 19
పఠాన్‌కోట్‌ తరహా దాడులకు ఉగ్రవాదుల స్కెచ్..!

దేశ వ్యాప్తంగా ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు స్కెచ్ వేస్తున్నారు. గతంలో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లపై దాడిచేసిన విధంగా.. మరోసారి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది నుంచి పది మంది ఉగ్రవాదులతో కూడిన జైషే ఉగ్ర మాడ్యూల్ ఒకటి ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో పంజాబ్‌లోని అమృత్ సర్, పఠాన్‌కోట్, జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎయిర్‌బేస్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీనగర్‌, అవంతిపూర్‌, జమ్ము, పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ల వద్ద ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

అటు దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో కూడా ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరికలు జారి చేశారు. ఇప్పటికే కేరళ, తమిళనాడులో ఎన్‌ఐఏ తనిఖీలు కూడా చేపట్టి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ కూడా చేపడుతున్నారు. అటు దేశ రాజధానిలో కూడా ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జమ్ముకశ్మీర్‌కు గల ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంతో.. భారత్‌లో అలజడి సృష్టించేందకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇంటలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి.