ఎట్టకేలకు దేవికకు బెయిల్.. ఏసీబీ కోర్టు ఆదేశం

ఈఎస్ఐ కుంభకోణంలో వందల కోట్లను కొల్లగొట్టి సంచలనం రేపిన దేవికారాణికి ఎట్టకేలకు ఏసీపీ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఇన్స్యూరెన్సు మెడికల్ స్కామ్‌లో దేవికారాణితోపాటు మరో నలుగురికి కూడా...

ఎట్టకేలకు దేవికకు బెయిల్.. ఏసీబీ కోర్టు ఆదేశం
Follow us

|

Updated on: Sep 21, 2020 | 5:34 PM

ESI medical scam: ఈఎస్ఐ కుంభకోణంలో వందల కోట్లను కొల్లగొట్టి సంచలనం రేపిన దేవికారాణికి ఎట్టకేలకు ఏసీపీ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఇన్స్యూరెన్సు మెడికల్ స్కామ్‌లో దేవికారాణితోపాటు మరో నలుగురికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జాయింట్ డైరెక్టర్ పద్మ, ఫార్మసిస్టు వసంతలతో పాటు మరో ఇద్దరు ఫార్మా ఉద్యోగులకు బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈఎస్ఐ స్కామ్‌లో తవ్విన కొద్ది అక్రమాలు బయట పడుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ దర్యాప్తు బ‌ృందాలు ఈఎస్ఐ స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ జెవెల్లరీస్ దుకాణంలో దేవికారాణి సుమారు 7 కోట్ల రూపాయల మేరకు ఆభరణాలు కొనుగోలు చేసినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా దేవికారాణి భర్తతోపాటు నగల షాపు యజమానులను ఈడీ అధికారులు విచారించారు.

అయితే, ముందుగా నమోదైన ఏసీబీ కేసులో ప్రస్తుతం దేవికారాణికి, మరో నలుగురికి బెయిల్ లభించింది. తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన ఈఎస్ఐ కుంభకోణం రాజకీయ ప్రకంపనలను కూడా రేపింది. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సుమారు 70 రోజులు ఈఎస్ఐ స్కామ్ విచారణలో భాగంగా జ్యూడిషియల్ రిమాండ్‌లో వుండాల్సి వచ్చింది.