ఆస్ట్రేలియాలో తెలుగు యువతి దారుణ హత్య

ఆస్ట్రేలియాలో గత ఆదివారం కనిపించకుండా పోయిన తెలుగు యువతి, డెంటిస్ట్ ప్రీతిరెడ్డి దారుణహత్యకు గురైంది. మెల్‌బోర్న్‌లోని సెయింట్ లియోనార్డ్స్‌లో జరుగుతున్న ఓ కాన్ఫిరెన్స్‌కు హాజరయ్యేందుకు గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన NRI ప్రీతిరెడ్డి… మళ్లీ కనిపించలేదు. చివరిసారిగా ఆదివారం రోజు (మార్చి 3) కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన ప్రీతిరెడ్డి… రాత్రి 11 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పింది. అయితే రాత్రి ఎంతసేపటికీ ఆమె రాకపోవడం…ఫోన్ కలవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు… పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]

ఆస్ట్రేలియాలో తెలుగు యువతి దారుణ హత్య
TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:30 PM

ఆస్ట్రేలియాలో గత ఆదివారం కనిపించకుండా పోయిన తెలుగు యువతి, డెంటిస్ట్ ప్రీతిరెడ్డి దారుణహత్యకు గురైంది. మెల్‌బోర్న్‌లోని సెయింట్ లియోనార్డ్స్‌లో జరుగుతున్న ఓ కాన్ఫిరెన్స్‌కు హాజరయ్యేందుకు గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన NRI ప్రీతిరెడ్డి… మళ్లీ కనిపించలేదు. చివరిసారిగా ఆదివారం రోజు (మార్చి 3) కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన ప్రీతిరెడ్డి… రాత్రి 11 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పింది. అయితే రాత్రి ఎంతసేపటికీ ఆమె రాకపోవడం…ఫోన్ కలవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు… పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు… ఆమె కేసు సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ల ద్వారా గాలించారు.

తాజాగా ఆమె మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. సిడ్నీలోని సౌత్ వేల్స్ ఏరియాలో పార్క్ చేసి ఉన్న ఆమె కారులోనే ఓ సూట్‌కేసులో కుక్కి, వదిలివెళ్లారు దుండగులు. ఆమె మృతదేహాంపై ఉన్న గాయాలను బట్టి కత్తితో దాడి చేసి చంపినట్టు నిర్ధారించారు పోలీసులు. ప్రీతిరెడ్డి మృతదేహం దొరికిన తర్వాతి రోజే ఆమె మాజీ ప్రియుడు హర్షవర్థన్ నార్డే… రోడ్డు ప్రమాదంలో చనిపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆమె చివరి సారిగా కనిపించిన మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్ సమీపంలో ప్రీతిరెడ్డితో పాటు హర్షవర్థన్ కూడా ఉన్నట్టు సీసీటీవీలో కనిపించింది. ఆ తర్వాత ఏమైంది… ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన తర్వాత రోజే హర్షవర్థన్‌కు ఎలా యాక్సిడెంట్ అయ్యిందనే విషయాలు మిస్టరీగా మారాయి.

సీడ్నిలోని మార్కెట్‌ స్ట్రీట్‌లో ఉన్న ఓ హోటెల్‌లో ఆదివారం హర్షవర్థన్‌తో కలిసి ప్రీతిరెడ్డి బస చేసిందని… ఆ తర్వాత సెయింట్ లియోనార్డ్స్‌లో కాన్ఫిరెన్స్‌కు అటెండ్ అయ్యిందని…. ఆ తర్వాత చివరి సారిగా మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్‌లో కనిపించిదని పోలీసులు తెలిపారు. అయితే ప్రీతిరెడ్డి మృతదేహాన్ని గుర్తించిన మరునాడే మాజీ ప్రియుడు హర్షవర్దన్ కారు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో నిజంగా మాజీ ప్రియుడే చంపాడా? లేదా? ఈ రెండు మరణాలకు ఏదైనా సంబంధం ఉందా? హత్యలో వేరే కోణాలు ఉన్నాయా? అన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu