Bigg Boss 4: కంటెస్టెంట్‌ల కళ్లు తెరిపించిన నాగార్జున

స్మాల్ గ్యాప్ తరువాత నాగార్జున బిగ్‌బాస్‌లో మళ్లీ రచ్చ చేశారు. కులుమనాలి నుంచి ఇంటి సభ్యుల కోసం తీసుకొచ్చిన స్వెటర్స్‌ని వారికి గిఫ్ట్‌గా అందించారు.

Bigg Boss 4: కంటెస్టెంట్‌ల కళ్లు తెరిపించిన నాగార్జున
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 01, 2020 | 8:32 AM

Nagarjuna Bigg Boss 4 Telugu: స్మాల్ గ్యాప్ తరువాత నాగార్జున బిగ్‌బాస్‌లో మళ్లీ రచ్చ చేశారు. కులుమనాలి నుంచి ఇంటి సభ్యుల కోసం తీసుకొచ్చిన స్వెటర్స్‌ని వారికి గిఫ్ట్‌గా అందించారు. ఆ తరువాత అఖిల్‌-సొహైల్‌ని కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి.. వారిద్దరి మధ్య వస్తున్న మనస్పర్థల గురించి ప్రస్తావించి సొహైల్ మాట్లాడిన వీడియోలు ప్లే చేశారు. ఆ తరువాత మోనాల్ వచ్చి అఖిల్‌కి సొహైల్ గురించి చెప్పిన వీడియోను కూడా ప్లే చేశారు. ఆ తరువాత మోనాల్, అఖిల్, సొహైల్ కూర్చొని మాట్లాడుకున్న వీడియోను కూడా ప్లే చేశారు. దీంతో థర్డ్ పర్సన్ వచ్చి చెప్పిన మాటలు విన్నందునే ఇలాంటి అపార్ధాలు తలెత్తాయని ఇద్దరూ ఒప్పుకొన్నారు. ఆ తరువాత ఇద్దరు బయటకు వచ్చి ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ( Bigg Boss 4: మీ ముగ్గురిని ఫైనల్‌కి చేరుస్తా.. నోయల్ శపథం)

ఇక ఆ తరువాత మోనాల్‌ని నాగార్జున కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. నోయెల్‌తో మోనాల్‌ మాట్లాడిన విషయాలను అభి, లాస్యలకు చెబుతున్న వీడియోతో పాటు మోనాల్ ఒంటెలా నడుస్తుందంటూ అభి కామెంట్ చేసిన వీడియోను సైతం నాగ్ ప్లే చేశారు. వాటిని చూసిన మోనాల్ అవాక్కయ్యింది. లాస్య, నోయల్‌లు పైకి నవ్వుతూ పుల్లలు పెడుతారని అనుకోలేదని చెప్పింది. నోయల్‌తో తనకు మంచి రిలేషన్ ఉందని, కానీ అతనిలో ఇంకో షేడ్ ఉందని తెలిసిందంటూ ఎమోషనల్‌ అయ్యింది. ( Bigg Boss 4: నోయల్‌ రీఎంట్రీపై నాగార్జున క్లారిటీ)

ఇక ఆ తరువాత అరియానాను కన్ఫెషన్ రూమ్‌కి పిలిపించారు నాగ్‌. ఇంటి సభ్యులు ఆమె పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో వీడియో చూపించారు. రేషన్ మేనేజర్ ఇవ్వలేదన్న కోపంలో అమ్మా రాజశేఖర్ ఏం మాట్లాడాడు..? అవినాష్ ఏం చేస్తున్నాడని ఆ వీడియోలో చూపించారు. దాన్ని చూసిన తరువాత అరియానా మాట్లాడుతూ.. ”నేను బిగ్‌బాస్ హౌస్‌కి కెప్టెన్ అవ్వాలని కల కన్నా కానీ కెప్టెన్ అయ్యాక వీళ్ల ప్రవర్తన చూసి చాలా బాధగా ఉంది. అని నాగార్జునను అడిగింది అరియానా. దానికి స్పందించిన నాగార్జున.. టాప్ పొజిషన్‌లో ఉన్నప్పుడు ఇలాంటి వస్తూ ఉంటాయి.. నీ ఆట నువ్వు ఆడు అని నాగ్‌ అరియానాకు ధైర్యం చెప్పారు. ( Bigg Boss 4: బాధంతా కక్కేసిన నోయల్‌.. అమ్మ, అవినాష్‌కి పెద్ద క్లాస్‌)