Bigg Boss 4: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె.? లేక అతడు.?
ఈ వారం అభిజిత్, అఖిల్, మోనాల్, సోహైల్, లాస్య, అరియానా, అమ్మ రాజశేఖర్, నోయల్, సుజాతలు ఎలిమినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో అభిజిత్, అఖిల్‌లు ఓటింగ్‌లో టాప్ రెండు స్థానాల్లో ఉన్నట్లు సమాచారం.
Bigg Boss 4: చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 4 ఐదో వారం ఎలిమినేషన్‌కు చేరుకుంది. మొదటి రెండు వారాలు సోసోగానే గడిచినా.. ఆ తర్వాత పుంజుకుంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు గేమ్‌పై ఫోకస్ చేస్తుండటంతో ఆసక్తికరంగా సాగుతోంది. అయితే కొందరి ఫోకస్ మాత్రం ఇంకా వేరేవాళ్ళపైనే ఉందని చెప్పాలి. అది ఎప్పుడు గేమ్‌పైకి వెళ్తుందో చూడాలి. (ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..)
ఇదిలా ఉంటే ఈ వారం అభిజిత్, అఖిల్, మోనాల్, సోహైల్, లాస్య, అరియానా, అమ్మ రాజశేఖర్, నోయల్, సుజాతలు ఎలిమినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో అభిజిత్, అఖిల్‌లు ఓటింగ్‌లో టాప్ రెండు స్థానాల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటిదాకా ఎలిమినేషన్ నామినేషన్స్‌లోకి అభిజిత్ ఎక్కువసార్లు వచ్చాడు. ఇక అతడు వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు భారీ ఓటింగ్‌తో సేఫ్ చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఆ తర్వాత అఖిల్ కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. (నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..)
ఇక సిల్లీ రీజన్‌కు నామినేట్ అయిన లాస్యకు ఎలాగో ప్రేక్షకుల నుంచి ఫుల్ సపోర్ట్ దక్కింది. అటు నోయల్, మోనాల్ కూడా సేవ్ కాగా.. అరియనాకు కూడా ఫ్యాన్స్ మరో అవకాశామిస్తున్నారు. మొదటి వారం పెద్దగా అరియానా స్క్రీన్ ప్రెజన్స్ లేకపోయినా.. ఆ తర్వాత ప్రతీ టాస్క్‌లోనూ 100 పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతుండటం.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుండటంతో ప్రేక్షకులు ఆమెను ఎలిమినేట్ చేయకుండా కాపాడుతున్నారు. కెప్టెన్సీ సాంప్రదాయం ప్రకారం గత వారం కుమార్ సాయి మాదిరిగానే ఈ వారం సోహైల్ కూడా సేఫ్ కానున్నాడని చెప్పవచ్చు. మిగిలిన ఇద్దరు అమ్మ రాజశేఖర్, సుజాతలు డేంజర్ జోన్‌లో ఉన్నారు.(తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొత్త రైళ్లు ఇవే..!)
హౌస్‌లో అందరి కంటే తానే పెద్దవాడినని చెప్పడం.. అలాగే ప్రతీ ఒక్కరిపై జులుం ప్రదర్శించడం అమ్మ రాజశేఖర్ మైనస్. ఆయన్ని ఎలిమినేషన్‌కు నామినేట్ చేస్తే సహించలేడు.. చేసినవాడికి శాపనార్ధాలు పెడతాడు. ఈ వారం నోయల్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇలా పలు మైనస్‌లతో ప్రేక్షకులు అమ్మ రాజశేఖర్‌కు తక్కువ ఓట్లను వేశారు. (ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..)
సుజాత విషయానికి వస్తే.. ఆమెకు నవ్వు ప్లస్సా.? మైనస్సా.? అనేది ఇప్పటికీ అర్ధం కావట్లేదు. నాగార్జున ఏమో ఆమె నవ్వు బాగుందని చెబితే.. ఫ్యాన్స్ మాత్రం అది ఫేక్ నవ్వు అని విమర్శిస్తున్నారు. అంతేకాదు నాగార్జునను సుజాత ‘బిట్టూ’ అని పిలుస్తుంది. అది ఆయన అభిమానులకు నచ్చట్లేదు. ఇక హౌస్‌లో ఈమే గాసిప్ క్వీన్.. ప్రస్తుతం సుజాతకే అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయి. సుజాతకు, అమ్మ రాజశేఖర్‌కు ఓట్లలో స్వల్ప తేడా మాత్రమే ఉంది. అయితే ఈ రోజు అర్ధరాత్రి వరకు ఓటింగ్ ఉండటంతో.. వీరిద్దరి స్థానాలు మారతాయా.? లేదా.? అనేది చూడాలి.