Bigg Boss Telugu 4: ఫన్‌లోనూ, పారితోషకంలోనూ ఇతడే టాప్ !

తెలుగు బిగ్ బాస్ తాజా సీజన్ రోజురోజుకు ఆసక్తికరంగా మారిపోతుంది. పరిణామాలు రోజురోజుకి మారిపోతున్నాయి. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులలో భాగంగా శత్రువులు మిత్రులు, మిత్రులు శత్రువులుగా మారిపోతున్నారు

Bigg Boss Telugu 4: ఫన్‌లోనూ, పారితోషకంలోనూ ఇతడే టాప్ !
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 09, 2020 | 5:06 PM

తెలుగు బిగ్ బాస్ తాజా సీజన్ రోజురోజుకు ఆసక్తికరంగా మారిపోతుంది. పరిణామాలు రోజురోజుకి మారిపోతున్నాయి. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులలో భాగంగా శత్రువులు మిత్రులు, మిత్రులు శత్రువులుగా మారిపోతున్నారు. కాగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వీక్షకుల్ని అలరిస్తున్నాడు. అతడితో ఎవరికి సమస్యలు లేకపోవడంతో, నామినేట్ కూడా చేయడం లేదు. కాగా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టడం కోసం అతడు మల్లెమాలతో తెగదెంపులు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. మల్లెమాల నుంచి ఎన్‌ఓసీ అందుకునేందుకు చాలా కష్టాలు కూడా పడ్డాడట. ఇకపోతే బిగ్ బాస్ హౌస్‌లో అత్యధిక పారితోషకం అందుకునేది కూడా అవినాషే అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అవినాష్ వారానికి ఐదు లక్షల అందుకుంటున్నాడట. మిగతా కంటెస్టెంట్లతో పోల్చుకుంటే అవినాష్ జనాలకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అతడి కామెడీకి సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటాయి. అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు అవినాష్‌కు అంత డబ్బు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కుర్రాడు ఇదే ఫన్‌తో ఎన్నాళ్లు బిగ్ బాగ్ హౌస్‌లో రాణిస్తాడో చూడాలి.

Also Read :

ఏపీలో కోవిడ్ నిబంధనల్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ

ఇవి షోరూం బండ్లు కాదు, అన్నీ కొట్టేసినవే !

కేబుల్ బ్రిడ్జిపై తిక్క వేశాలు.. ఆట కట్టించిన పోలీసులు