ఏపీలో కోవిడ్ నిబంధనల్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ

దేశవ్యాప్తంగా అన్ లాక్ 5 అమలవుతుంది. ఈ క్రమంలో భారీ సడలింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, వ్యాధి వ్యాప్తి చెందకుండా అంతేస్థాయిలో నిబంధనలు కూడా పాటించాలని సూచించింది. ఈ క్రమంలో ఏపీలో కోవిడ్ నిబంధనల్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఏపీలో కోవిడ్ నిబంధనల్ని పటిష్టంగా అమలు చేసేందుకు  ఉత్తర్వులు జారీ
Follow us

|

Updated on: Oct 09, 2020 | 2:21 PM

దేశవ్యాప్తంగా అన్ లాక్ 5 అమలవుతుంది. ఈ క్రమంలో భారీ సడలింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, వ్యాధి వ్యాప్తి చెందకుండా అంతేస్థాయిలో నిబంధనలు కూడా పాటించాలని సూచించింది. ఈ క్రమంలో ఏపీలో కోవిడ్ నిబంధనల్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • అన్ లాక్ 5 సడలింపుల్లో భాగంగా సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు, రైతు బజార్లు, షాపింగ్ మాల్స్ తెరుచుకోనుండటంతో అన్ని చోట్లా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం,  చేతులు శుభ్రపరుచుకునేలా ఏర్పాట్లు చేయించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాల జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర హోంశాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలు సాఫీగా జరిగేందుకు ప్రైవేటు యాజమాన్యాలకు అవగాహన కల్పించాలని సూచనలు జారీ
  • ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీల లాంటి ప్రజా రవాణా సాధనాల్లో తప్పక కోవిడ్ నియంత్రణ మార్గదర్శకాలకు సంబంధించి సమాచారం ఉండాలని పేర్కొన్న ప్రభుత్వం
  • దేవాలయాలు, మసీదులు, చర్చిల్లోనూ ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసిన ప్రభుత్వం
  • మతపెద్దలు కూడా కోవిడ్ నియంత్రణ కార్యాచరణను ప్రజలు పాటించేలా ప్రచారం చేయాలని సూచన
  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని వాణిజ్య దుకాణాలు, చౌకదుకాణాల్లోనూ ప్రవేశమార్గం వద్దే కోవిడ్ నిబంధనల ప్రదర్శించాలని స్పష్టం చేసిన ప్రభుత్వం
  • మాస్కు లేకపోతే సేవలను నిరాకరించాలని స్ఫష్టం చేసిన ప్రభుత్వం
  • షాపింగ్ మాల్స్, దుకాణాలు, సినిమా థియేటర్లు , వినోద ప్రాంతాలు, ఫంక్షన్ హాళ్లు ఇతర బహిరంగ ప్రాంతాలకు మాస్కు లేకపోతే ప్రవేశం నిరాకరించాలని సూచించిన ప్రభుత్వం
  • దీని పర్యవేక్షణకు ఒక ఉద్యోగిని నియమించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులకు ఆదేశాలు జారీ
  • ప్రతి ప్రభుత్వ ప్రకటన, వెబ్ సైట్లలోనూ కోవిడ్ నియంత్రణా మార్గదర్శకాలను కనీసం మూడు లైన్లలో ప్రచురించటం, ప్రసారం చేయాలని స్పష్టం చేసిన ప్రభుత్వం
  • ప్రభుత్వ, ప్రైవేటు దుకాణాల్లోని ప్రతి బిల్లులోనూ మాస్కు, చేతుల శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించేలా జాగ్రత్తలను ప్రచురించాలని సూచించిన ప్రభుత్వం.
  • ఇప్పటికే ముద్రించిన వాటిపై స్టాంపు వేయాలని సూచన
  • అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మైకుల ద్వారా మాస్కు ధరించేలా, చేతులను శానిటైజ్ చేసుకోవటం, భౌతిక దూరం పాటించటం వంటి వాటిపై మైకుల ద్వారా ప్రచారం చేయాలని సూచన చేసిన ప్రభుత్వం
  • టెలివిజన్ ఛానళ్లు, ఎఫ్ఎం ఛానళ్లు, ఆల్ ఇండియా రేడియో సహా ఈ మార్గదర్శకాలను సంక్షిప్తంగా ప్రజలకు తెలిసేలా ప్రకటనలు ఇవ్వాలని ప్రతి గంటకూ ఈ ప్రకటన ఉండాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు
  • ప్రజలు సమావేశమయ్యే ప్రతీ సందర్భంలోనూ అధికారిక, అనధికారిక లేదా కుటుంబ సమావేశాల్లోనూ ముందుగా ఈ కోవిడ్ నియంత్రణ మార్గదర్శకాల ప్రచారంతోనే మొదలు పెట్టాలని సూచన జారీ
  • అన్ని సినిమా థియేటర్లలోనూ మాస్కు ధరించటం, శానిటైజేషన్, భౌతిక దూరానికి సంబంధించి ప్రచార ప్రకటనలు వేయాలని ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం
  • పాఠశాలలు, విద్యాసంస్థలు , పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోటా ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించేలా విధిగా ప్రచారం చేయాలని ఆదేశించిన ప్రభుత్వం
  • విద్యా సంస్థల్లో ప్రతి పిరియడ్ తర్వాత అధ్యాపకులు విద్యార్ధులకు ఈ జాగ్రత్తలు చెప్పాలని స్పష్టం చేసిన ప్రభుత్వం
  • ప్రతి సందర్భంలోనూ కనీసం మూడు నిముషాల మేర సంక్షిప్తంగా మాస్కు, శానిటైజర్, భౌతిక దూరం పాటించేలా ప్రచారం ఉండాలని మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
  • బహిరంగ ప్రదేశాలు, పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాళ్లు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, పారిశ్రామిక ప్రాంతాల్లోకి మాస్కు లేకపోతే ప్రవేశం లేదన్న నిబంధన పాటించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
  • మాస్కు ధారణ, చేతులు శుబ్రపరుచుకోవటం, భౌతిక దూరం తదితర అంశాలపై ఇంటింటి ప్రచారం చేయాలని కూడా నిర్ణయించిన ప్రభుత్వం .
  • వీటితో పాటు స్వచ్చంధంగా పరీక్ష చేయించుకునేందుకు ముందుకు వచ్చేలా ప్రజల్లో వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశాలు
  • ప్రతీ నెలా వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలూ ఇంటింటి ప్రచారం, తనిఖీ చేసేలా వైద్యారోగ్యశాఖకు సూచనలు
  • ఆరోగ్యసేతు యాప్ ను రాష్ట్రవ్యాప్తంగా 77 లక్షల మంది వినియోగిస్తున్నారని ఇప్పటి వరకూ 1.3 కోట్ల మంది స్మార్ట్ పోన్లలో డౌన్ లోడ్ చేసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడి
  • కోవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఇచ్చిన ప్రచారంలో భాగంగా మాస్కే కవచం ప్రకటనలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ లలో ప్రచారం చేయాలని సమాచార పౌరసంబంధాల శాఖకు సూచనలు

Also Read : నందనవనంలో మహిళ దారుణహత్య

Latest Articles
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్.. ఊ అంటావా మావాకు మాస్ స్టెప్పులు..
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్.. ఊ అంటావా మావాకు మాస్ స్టెప్పులు..
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు
వైరల్ అవుతున్న మహేష్ హెయిర్ స్టైల్
వైరల్ అవుతున్న మహేష్ హెయిర్ స్టైల్