వడ గాలులు వీచే సమయంలో వాటి ప్రభావాన్ని తగ్గించడానికి మీరు చేయవలసిన చర్యలు
Phani.ch
30 April 2024
వడ గాలులు వస్తాయో లేదో తెలుసుకోవడానికి స్థానిక వాతావరణ సూచన కోసం రేడియో వినండి, టీవీ చూడండి, న్యూస్ పేపర్ చదవండి.
తేలికైన, లేత-రంగు, వదులుగా ఉన్న కాటన్ దుస్తులను ధరించండి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు రక్షణ కళ్లజోళ్లు, గొడుగు/టోపీ, బూట్లు లేదా చప్పల్స్ ఉపయోగించండి.
వీలైనంత తరచుగా, దాహం వేసిన వేయకపోయినా తగినంత నీరు త్రాగండి. ప్రయాణిస్తున్నప్పుడు, మీతో పాటు నీటిని తీసుకెళ్లండి
మీ ఇంటిని చల్లగా ఉంచండి, కర్టెన్లు, షట్టర్లు లేదా సన్‌షేడ్‌లను ఉపయోగించండి మరియు రాత్రి కిటికీలను తెరవండి.
మీరు బయట పని చేస్తుంటే, టోపీ లేదా గొడుగు ఉపయోగించండి .ORS లేక ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, తోరణి (బియ్యం నీరు), నిమ్మకాయ నీరు, మజ్జిగ మొదలైనవి వాడండి.
వడదెబ్బ , వేడి దద్దుర్లు లేదా వేడి వలన తిమ్మిర్లు వంటి బలహీనత, మైకము, తలనొప్పి, వికారం, చెమటలు మరియు మూర్ఛలు వంటి సంకేతాలను గుర్తించండి. మీకు మూర్ఛ లేదా అనారోగ్యం అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
ఫ్యాన్లు, తడి దుస్తులను వాడండి మరియు తరచుగా చల్లటి నీటితో స్నానం చేయండి. పని ప్రదేశానికి సమీపంలో చల్లని త్రాగునీటిని అందించండి.