తమిళ హీరో విష్ణువిశాల్‌ తండ్రిపై కేసు పెట్టిన కమెడియన్‌

తమిళహీరో విష్ణు విశాల్‌ తెలుసుకదా! అదేనండి గుత్తా జ్వాలతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు.. ఆ విష్ణు విశాలే! అతడి తండ్రి రమేశ్‌ కడవ్లాపై ప్రముఖ హాస్య నటుడు సూరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ప్లాట్‌ అమ్మకానికి ఉందంటూ అయిదేళ్ల కిందట సూరి దగ్గర రమేశ్‌ కడవ్లా 2 కోట్ల 70 లక్షల రూపాయలు తీసుకున్నాడట! అప్పట్నుంచి అదిగో ఇదిదో అని తిప్పుతున్నారే తప్ప తీసుకున్న అమౌంట్ ఇవ్వడం లేదట! ఎన్నిసార్లు అడిగినా వారి నుంచి సమాధానం రాలేదట! తాను […]

తమిళ హీరో విష్ణువిశాల్‌ తండ్రిపై కేసు పెట్టిన కమెడియన్‌
Follow us
Balu

|

Updated on: Oct 09, 2020 | 3:45 PM

తమిళహీరో విష్ణు విశాల్‌ తెలుసుకదా! అదేనండి గుత్తా జ్వాలతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు.. ఆ విష్ణు విశాలే! అతడి తండ్రి రమేశ్‌ కడవ్లాపై ప్రముఖ హాస్య నటుడు సూరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ప్లాట్‌ అమ్మకానికి ఉందంటూ అయిదేళ్ల కిందట సూరి దగ్గర రమేశ్‌ కడవ్లా 2 కోట్ల 70 లక్షల రూపాయలు తీసుకున్నాడట! అప్పట్నుంచి అదిగో ఇదిదో అని తిప్పుతున్నారే తప్ప తీసుకున్న అమౌంట్ ఇవ్వడం లేదట! ఎన్నిసార్లు అడిగినా వారి నుంచి సమాధానం రాలేదట! తాను మోసపోయానని గ్రహించిన సూరి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. రమేశ్‌తో పాటు ఫైనాన్షియర్‌ అంబువేల్‌ రాజన్‌కు కూడా ఇందులో ప్రమేయం ఉందని సూరి ఆరోపిస్తున్నాడు.. అదే కాకుండా వీర ధీర సూరన్‌ సినిమాలో నటించిన తనకు 40 లక్షల పారితోషికాన్ని కూడా ఇవ్వకుండా సతాయిస్తున్నారని చెప్పాడు. సూరి ఫిర్యాదుతో అడయార్‌ పోలీసులు రమేశ్‌తో పాటు అంబువేల్‌పై కేసులు పెట్టారు. అన్నట్టు రమేశ్‌ కూడా పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్‌ అయినవారే! సూరి పోలీసు కేసు పెట్టాడని తెలుసుకున్న విష్ణు విశాల్‌ షాక్‌ అయ్యారు.. నిరాధారమైన ఆరోపణలు తమపై చేస్తున్నారని చెప్పాడు.. 2017లో తమ ప్రొడక్షన్‌లో వచ్చిన పరాంబరై సినిమా కోసం సూరిని తీసుకున్నామని, అడ్వాన్స్‌ కూడా ఇచ్చామని విష్ణువిశాల్‌ వివరించారు.. సినిమా నుంచి తప్పుకున్న సూరి …తీసుకున్న అడ్వాన్స్‌ను ఇప్పటి వరకు చెల్లించలేదని అన్నాడు. తమ కుటుంబంపై నిందలు వేస్తున్నా సూరి.. తన గురించి తాను ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుందని ట్విట్టర్‌లో సలహా ఇచ్చాడు విష్ణు విశాల్‌..