అప్పుడు రెట్టింపుస్థాయిలో ఉంటుంది.. ఆగ్రహంతో ఊగిపోయిన జేసీ

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ గనులకు అనుమతులు ఇవ్వకపోతే నిరాహారదీక్ష చేస్తానంటూ తాడిపత్రి గనులు భూగర్భ శాఖ కార్యాలయం దగ్గర శుక్రవారం ఆందోళనకు సిద్ధమయ్యారు. సున్నపురాయి గనుల లీజు విషయంలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన దివాకర్ రెడ్డి.. తమకు ఇప్పుడు సన్మానం చేసిన అధికారులకు.. రెట్టింపు స్థాయిలో ఉంటుందని హెచ్చరికలు జారీచేశారు. “ఈ నియంత పాలన ఎన్ని రోజులు ఉంటుందో మేము చూస్తాం.. దీనికి ఫలితం […]

అప్పుడు రెట్టింపుస్థాయిలో ఉంటుంది.. ఆగ్రహంతో ఊగిపోయిన జేసీ
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 09, 2020 | 3:36 PM

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ గనులకు అనుమతులు ఇవ్వకపోతే నిరాహారదీక్ష చేస్తానంటూ తాడిపత్రి గనులు భూగర్భ శాఖ కార్యాలయం దగ్గర శుక్రవారం ఆందోళనకు సిద్ధమయ్యారు. సున్నపురాయి గనుల లీజు విషయంలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన దివాకర్ రెడ్డి.. తమకు ఇప్పుడు సన్మానం చేసిన అధికారులకు.. రెట్టింపు స్థాయిలో ఉంటుందని హెచ్చరికలు జారీచేశారు. “ఈ నియంత పాలన ఎన్ని రోజులు ఉంటుందో మేము చూస్తాం.. దీనికి ఫలితం అనుభవించక తప్పదు. తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు… అనవసరమైన విషయాలలో కేసులు పెట్టారు. తన సోదరుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టారు. తన మీద ఎందుకో దయ తలచారు. ఈ ప్రభుత్వంలో అధికారులకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. కేవలం ట్రాన్స్‌ఫర్ లకు భయపడి తమను ఇలా ఇబ్బంది పెడుతున్నారు”. అంటూ జేసీ మొత్తుకున్నారు.