AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: గంగవ్వ, అభిజిత్‌లు సేఫ్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరూ!

చూస్తుండగానే తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 రెండోవారం చివరికి వచ్చింది. మొదటి వారం సోసోగానే సాగినా.. చివర్లో నాగార్జున క్లాస్ పీకడంతో రెండో వారం కంటెస్టెంట్లు కాస్త అలరించారని చెప్పాలి.

Bigg Boss 4: గంగవ్వ, అభిజిత్‌లు సేఫ్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరూ!
Ravi Kiran
|

Updated on: Sep 18, 2020 | 6:51 PM

Share

చూస్తుండగానే తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 రెండోవారం చివరికి వచ్చింది. మొదటి వారం సోసోగానే సాగినా.. చివర్లో నాగార్జున క్లాస్ పీకడంతో రెండో వారం కంటెస్టెంట్లు కాస్త అలరించారని చెప్పాలి. ఇక ఈ వారం గంగవ్వ, నోయల్, కరాటే కళ్యాణి, మొనాల్ గజ్జర్, సొహైల్, అమ్మా రాజశేఖర్ కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్‌‌లు ఎలిమినేషన్స్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లనున్నారు. (Bigg Boss 4)

తాజాగా సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం హౌస్‌ నుంచి కరాటే కళ్యాణి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆమెను తొలివారమే ఎలిమినేట్ చేయాలని ప్రేక్షకులు డిసైడ్ అయ్యారు. తొలివారం ఆమె ఆటతీరు చాలామందికి విసుగు తెప్పించింది. బిగ్ బాస్ 3లో హేమను తొలివారంలో సెండ్ ఆఫ్ ఇచ్చినట్లే.. కరాటే కళ్యాణిని కూడా పంపించాలని కామెంట్స్ చేశారు. అయితే ఎలిమినేషన్ నామినేషన్స్ నుంచి జస్ట్ మిస్ అయింది. కానీ ఇప్పుడు పక్కాగా రెండో వారం కరాటే కళ్యాణి హౌస్ నుంచి బయటికి వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

మొదటి వారంలో కళ్యాణి ప్రవర్తన, ఆధిపత్య ధోరణి, ఇతర కంటెస్టెంట్లతో గొడవకు దిగడం వంటివి ప్రేక్షకులు విసుగు తెప్పించాయి. వారం చివరిలో నాగార్జున కూడా దీనిపైనే గట్టిగా క్లాస్ పీకాడు. ఇందుకు అనుగుణంగా రెండో వారంలో ఆమెలో కొంత మార్పు కనిపించినప్పటికీ.. జరగాల్సింది జరిగిపోయింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే కళ్యాణికి ఈ వారం లీస్ట్ ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అమ్మ రాజశేఖర్‌కు కూడా తక్కువ ఓటింగ్ వచ్చాయని సమాచారం. అటు టాప్‌లో మరోసారి గంగవ్వ, అభిజిత్ కొనసాగుతున్నారట. చూడాలి మరి బిగ్ బాస్ ఆమెను ఈ వారం ఎలిమినేట్ చేస్తారో లేదో.!

Also Read:

Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

పశువులకు మరో అంతుచిక్కని వ్యాధి.. ఆందోళనలో రైతులు.!

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..