Bigg Boss 4: ఈ వారం ‘నో’ ఎలిమినేషన్.. ‘బిగ్‌బాస్’ నిర్వాహకుల ప్రణాళిక ఇదేనా..!
బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్ 12 వారాలను పూర్తి చేసుకుంది. ఇప్పుడు హౌజ్‌లో అభిజిత్, అఖిల్, అవినాష్, అరియానా, మోనాల్, హారిక, సొహైల్‌లు మిగిలారు.
No Elimination Today: బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్ 12 వారాలను పూర్తి చేసుకుంది. ఇప్పుడు హౌజ్‌లో అభిజిత్, అఖిల్, అవినాష్, అరియానా, మోనాల్, హారిక, సొహైల్‌లు మిగిలారు. వీరిలో ఈ వారం నామినేషన్‌లలో అవినాష్, అరియానా, మోనాల్, అఖిల్‌లు ఉండగా.. అవినాష్‌కి ఎవిక్షన్ పాస్ లభించగా.. దాన్ని వాడుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శనివారం ఎపిసోడ్‌లో మోనాల్‌ని సేవ్ చేశారు నాగార్జున. ఇక మిగిలింది అఖిల్, అరియానా. హౌజ్‌లోని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లలో వీరిద్దరు ఉండగా.. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది.
ఇలాంటి నేపథ్యంలో ఈ వారం బిగ్‌బాస్ ఎలిమినేషన్‌ని సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇవాళ ఎలిమినేషన్ ఉండదట. అయితే రానున్న రెండు వారాల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయనున్నారు. ఇక ఆ తరువాత డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలేను నిర్వహించాలని నిర్వాహకులు పక్కా ప్రణాళికను వేసుకున్నట్లు సమాచారం. కాగా టాప్ 2లో అభిజిత్, సొహైల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మిగిలిన వారిలో అఖిల్, అవినాష్, మోనాల్‌లు టాప్ 5లో ఉండనున్నట్లు టాక్. కాగా మరోవైపు ఈ వారం ఎపిసోడ్‌కి కన్నడ స్టార్ నటుడు సుదీప్ అతిథిగా రాబోతున్నారు.