Bigg Boss 4: ఈ రోజు అతిథిగా స్టార్ హీరో.. ఇవాళ మరింత ఎంటర్‌టైన్‌గా ఉండబోతున్న షో

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ షో ప్రారంభమై ఇవాళ్టికి 12 వారాలు పూర్తి అవ్వనుంది.

Bigg Boss 4: ఈ రోజు అతిథిగా స్టార్ హీరో.. ఇవాళ మరింత ఎంటర్‌టైన్‌గా ఉండబోతున్న షో
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 29, 2020 | 3:10 PM

Kicha Sudeep as guest:  బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ షో ప్రారంభమై ఇవాళ్టికి 12 వారాలు పూర్తి అవ్వనుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ అభిమానులను మరింత ఎంటర్‌టైన్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఈ షోలోకి అతిథులుగా రాగా.. ఇవాళ కన్నడ స్టార్ హీరో సుదీప్ షోలో రచ్చ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.

బిగ్‌బాస్‌ని హోస్ట్ చేయడం నాకు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. అయితే ఇవాళ తెలుగు బిగ్‌బాస్‌కి అతిథిగా వెళ్తుండటం మరింత సంతోషాన్ని ఇస్తోంది. ఎప్పుడూ అందంగా ఉండే నాగార్జున సర్‌తో స్టేజ్‌ని పంచుకోవడం, ఇంట్లో ఉన్న వారితో మాట్లాడటం ఆనందాన్ని ఇచ్చింది. మీ సాదర స్వాగతానికి థ్యాంక్యు సర్ అని సుదీప్ కామెంట్ పెట్టారు. ఈ సందర్భంగా నాగార్జునతో తీసుకున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ఇక సుదీప్ మాటలను బట్టి చూస్తుంటే ఇవాళ ఎపిసోడ్‌ రచ్చ రచ్చగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.

కాగా ఈగతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సుదీప్‌.. ఆ తరువాత బాహుబలి 2, సైరా చిత్రాల్లో ఇక్కడి వారికి మరింత దగ్గరయ్యారు. ఇక మరోవైపు కన్నడలో బిగ్‌బాస్‌ షో 7 సీజన్‌లను పూర్తి చేసుకోగా.. అన్నింటికి సుదీప్‌నే వ్యాఖ్యతగా వ్యవహరించారు. ప్రస్తుతం అక్కడ ఎనిమిదో సీజన్ కొనసాగుతోంది.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి