Bigg Boss 4: పేరెంట్స్‌కి మరో షాకింగ్ న్యూస్ చెప్పిన లాస్య.. సారీ అంటూ భావోద్వేగం

బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్లకముందు తన ప్రేమ పెళ్లి గురించి ఏదో అరకొర చెప్పిన యాంకర్ లాస్య.. అక్కడికి వెళ్లాక మాత్రం సీక్రెట్‌లన్నీ బయటపెడుతోంది

Bigg Boss 4: పేరెంట్స్‌కి మరో షాకింగ్ న్యూస్ చెప్పిన లాస్య.. సారీ అంటూ భావోద్వేగం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Nov 13, 2020 | 9:11 AM

Bigg Boss 4 Lasya: బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్లకముందు తన ప్రేమ పెళ్లి గురించి ఏదో అరకొర చెప్పిన యాంకర్ లాస్య.. అక్కడికి వెళ్లాక మాత్రం సీక్రెట్‌లన్నీ బయటపెడుతోంది. ఇంతకుముందు 2012లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, 2014లో ప్రెగ్నెన్సీ కూడా తీయించుకున్నానని సీక్రెట్లు రివీల్ చేసిన లాస్య.. తాజాగా మరో విషయాన్ని బయటపెట్టింది.

గురవారం నాటి ఎపిసోడ్‌లో ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని సీక్రెట్ చెప్పాలని బిగ్‌బాస్ చెప్పాడు. సీక్రెట్ చెప్పిన వారికి ఉత్తరాలు కూడా ఉంటాయని తెలిపాడు. ఈ సందర్భంగా లోపలికి వెళ్లిన లాస్య.. తన భర్త తన కంటే ఏడాది చిన్నవాడని తెలిపింది. అంతేకాదు అతడు చాలా పేదవాడని, ఏం లేదని పేర్కొంది. నేను మరాఠీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పా. దీంతో అందరూ ఆ అబ్బాయి కోటీశ్వరుడు, డబ్బులున్న వాడు అనుకున్నారు. కానీ అతడు మిడిల్ క్లాస్ కూడా కాదు. నా కంటే మంజునాథ్‌ ఏడాది చిన్నోడు. ఆ విషయం తెలిసిన తరువాత నాకంటే చిన్నవాడిని లవ్ చేశానా..? అని అనుకున్నా. దానికి ఎలా రియాక్ట్‌ అవ్వాలో కూడా నాకు తెలీలేదు. ఈ విషయం మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు.

సారీ అమ్మ ఈ షోకి వచ్చిన తరువాత షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నా. మీ అల్లుడు నా కంటే ఏడాది చిన్నోడు అమ్మ. కానీ నన్ను బాగా చూసుకుంటాడు అంటూ లాస్య ఏడ్చేసింది. ఆ తరువాత ఆమెకు లేఖ అందగా.. ఏడుస్తూ మరోసారి కంటతడి పెట్టుకుంది.