Bigg Boss 4: జున్నును చూసి ఏడ్చేసిన లాస్య.. వీడు నీకంటే స్ట్రాంగ్‌ అన్న మంజునాథ్‌

కంటెస్టెంట్‌ల కుటుంబ సభ్యులు బిగ్‌బాస్‌ హౌజ్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాస్య కోసం ఆమె భర్త మంజునాథ్‌, కొడుకు జున్ను వచ్చారు

Bigg Boss 4: జున్నును చూసి ఏడ్చేసిన లాస్య.. వీడు నీకంటే స్ట్రాంగ్‌ అన్న మంజునాథ్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 21, 2020 | 8:07 AM

Lasya Manjunath Junnu: కంటెస్టెంట్‌ల కుటుంబ సభ్యులు బిగ్‌బాస్‌ హౌజ్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాస్య కోసం ఆమె భర్త మంజునాథ్‌, కొడుకు జున్ను వచ్చారు. ఇక కొడుకును చూడగానే లాస్య భోరున ఏడ్చేసింది. బుజ్జీ అంటూ గార్డెన్‌ ఏరియా నుంచి పరుగెత్తుకొచ్చింది. ఏడుస్తూ భర్తతో మాట్లాడింది. ఈ సందర్భంగా మంజునాథ్‌, లాస్యతో పాజిటివిటీని నింపాడు. (Bigg Boss 4: మోనాల్‌పై అలిగిన అఖిల్‌.. ఇంటి నియమాలు పాటించని కొత్త కెప్టెన్‌)

”నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు. నువ్వెంత స్ట్రాంగ్‌గా ఉన్నావో.. వీడు నీ కన్నా ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అస్సలు ఏడవడం లేదు. చాలా బాగా ఆడుతున్నావు. ఇంకా బాగా ఆడు. కిచెన్‌లో ఎక్కువగా ఉండిపోతున్నావు. అక్కడి నుంచి వచ్చి గేమ్‌ ఆడు. 10 వారాల పాటు ఉన్నావంటే నువ్వెంత స్ట్రాంగ్‌నో అర్థం చేసుకో అని లాస్యకు అక్కడి నుంచి బయటికి వచ్చి గేమ్ బాగా ఆడాలి. 10 వారాల పాటు ఉన్నావంటే నువ్వు ఎంత స్ట్రాంగో అర్థం చేసుకో” అని ధైర్యం చెప్పాడు. ఇక జున్నును ఇంటి సభ్యులు ఆడించారు. అవినాష్‌ జోకర్‌గా గెటప్ వేసి నవ్వించాడు. ఇక ఇంటి సభ్యులు లాస్యపై జోకులు వేస్తూ ఆమె భర్తతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులు ‘పప్పు’ ఇష్యూని ప్రస్తావించారు. అలాగే ఆంటీ అంటూ లాస్యను ఆట పట్టించారు. లాస్య ఆంటీ కాదని, ఆమె నవ్వు జన్యూన్‌ అని, గేమ్‌ చాలా బాగా ఆడుతుందని మంజునాథ్‌ చెప్పుకొచ్చాడు. (Bigg Boss 4: మొత్తానికి కెప్టెన్‌ అయిపోయిన హారిక.. తట్టుకోలేక పోయిన అఖిల్‌ కోపంతో..!