Bigg Boss 4: మోనాల్‌పై అలిగిన అఖిల్‌.. ఇంటి నియమాలు పాటించని కొత్త కెప్టెన్‌

బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇమ్యూనిటీతో ఎలాంటి కష్టం పడకుండా గత వారాంతంలో కెప్టెన్సీ సాధించిన అఖిల్‌.. ఈసారి కెప్టెన్సీ పోయినందుకు చాలా బాధపడ్డాడు

Bigg Boss 4: మోనాల్‌పై అలిగిన అఖిల్‌.. ఇంటి నియమాలు పాటించని కొత్త కెప్టెన్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 21, 2020 | 7:37 AM

Akhil feels angry: బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇమ్యూనిటీతో ఎలాంటి కష్టం పడకుండా గత వారాంతంలో కెప్టెన్సీ సాధించిన అఖిల్‌.. ఈసారి కెప్టెన్సీ పోయినందుకు చాలా బాధపడ్డాడు. ఇక మరోవైపు హారికను మోనాల్‌ గెలిపించడం అతడికి మరింత కోపాన్ని తెప్పించింది. దీంతో సొహైల్‌ దగ్గర తన బాధనంతా చెప్పుకున్నాడు. ఇక అఖిల్‌ని ఓదార్చేందుకు వచ్చిన మోనాల్‌పై అలిగాడు. అయితే హారిక తనను నమ్మందని, కానీ నువ్వు నమ్మలేదని చెప్పింది. నన్నొక ఐదు నిమిషాలు వదిలేస్తావా..? అని అడిగాడు. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తరువాత పొద్దున అవినాష్‌, లాస్య, అరియానా అందరూ సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు. కానీ ఆ సపోర్ట్‌ అంతా ఎక్కడికి పోయింది అని తన బాధను చెప్పుకొచ్చాడు.

మరోవైపు కెప్టెన్ అయిన హారికపై అభిజిత్‌ జోకులు వేశాడు. ఎంత పని చేశావు మోనాల్‌..? ఆమెను ఎందుకు కెప్టెన్ చేశావు అని హారికను ఆటపట్టించాడు. నా మీద జోకులు వేస్తే ఊరుకోవాలి. నీ మీద వేస్తేనేమో సీరియస్ అవుతావు. ఇంకోసారి నేను జోకులు వేసినప్పుడు సీరియస్ అయితే నీ పని చెప్తా అంటూ స్వీట్‌ వార్నింగ్ ఇచ్చింది. ఇక కెప్టెన్ అయిన ఆనందంలో హారిక మైక్‌ ధరించకుండానే ఇళ్లంతా తిరుగుతోంది. దీంతో మైక్‌ ధరించు హారిక అని బిగ్‌బాస్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. వెంటనే కెప్టెన్‌నే ఇంటి నియమాలు పాటించడం లేదంటూ హారికను ఆటపట్టించారు. పనిష్మెంట్‌గా హారికతో పాటు మిగిలిన వారు స్టెప్పులు వేస్తూ బిగ్‌బాస్‌కి క్షమాపణ చెప్పారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌