Bigg Boss 4: మొత్తానికి కెప్టెన్ అయిపోయిన హారిక.. తట్టుకోలేక పోయిన అఖిల్ కోపంతో..!
ప్రతివారం లాగే ఈ వారం హౌజ్ కెప్టెన్సీ టాస్క్ జరిగింది. కమాండో ఇన్‌స్టిట్యూట్ టాస్క్‌లో స్టార్లు సాధించిన అఖిల్, అభిజిత్, హారికలు కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు
Harika new captain: ప్రతివారం లాగే ఈ వారం హౌజ్ కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా జరిగింది. కమాండో ఇన్‌స్టిట్యూట్ టాస్క్‌లో స్టార్లు సాధించిన అఖిల్, అభిజిత్, హారికలు కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఇక కెప్టెన్ అవ్వడం కోసం ఈ ముగ్గురు మిగిలిన ఇంటి సభ్యులను ఒప్పించి వారి భుజాల మీద కూర్చోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ సేపు కిందికి దిగకుండా భుజాల మీద ఉంటారో వారే కెప్టెన్ అవుతారు. అలాగే ఎత్తుకున్న వ్యక్తి బాక్స్ దాటినా.. ఓడిపోయినట్లే.
ఈ క్రమంలో మరోసారి కెప్టెన్ అవ్వాలన్న కోరికతో అఖిల్, సొహైల్‌ని ఎంచుకున్నాడు. ఆ తరువాత అభిజిత్ అవినాష్‌ను, హారిక మోనాల్‌ని ఎంచుకున్నారు. మొదటగా అభి బరువును మోయలేక అవినాష్ చేతులేత్తేశాడు. ఆ తర్వాత ఎంతసేపైనా ఉంటానని గొప్పలు చెప్పిన సోహైల్, అఖిల్ బరువును మోయలేక కిందపడిపోయాడు. దీంతో మోనాల్ భుజాలపై ఉన్న హారిక కొత్త కెప్టెన్‌గా ఎన్నికైంది. దీంతో హారిక ఆనందం రెట్టింపు అయ్యింది. ఎనిమిది సార్లు పోటీ పడినా.. గెలవలేదని, ఈ సారి మోనాల్ సాయంతో గెలిచానని ఆనందంతో చిందులేసింది. మోనాల్‌ని గట్టిగా హగ్ చేసుకొని ముద్దులు పెట్టింది. నోయల్ టీషర్ట్ వేసుకొని ఈ టాస్క్ ఆడాడని, అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం కెప్టెన్ అయ్యానని సంతోషం వ్యక్తం చేసింది.
మరోవైపు హారిక కెప్టెన్ అవ్వడం అఖిల్‌కి ఆగ్రహం తెప్పించింది. అందులో హారికను మోనాల్ గెలిపించడాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. బయటకు మామూలుగా కనిపించినా.. స్లీపింగ్ రూమ్‌లో ఉన్నప్పుడు తన బాధను సొహైల్‌తో పంచుకున్నాడు. దీంతో సొహైల్, అఖిల్‌కి సారీ చెప్పాడు. ఆ లోపు లడ్డూలు పట్టుకొని వచ్చిన హారిక.. అఖిల్‌తో లడ్డు తినిపించింది. హారికతో పాటు మోనాల్ కూడా అక్కడకు వెళ్లింది. వెంటనే సొహైల్.. నువ్వు ఇంకో 10 నిమిషాలు అయినా ఉండేదానివి కదా అని అడిగాడు. దానికి ఆమె నాపై నమ్మకం ఉంచింది అని మోనాల్ సమాధానమిచ్చింది. ఆ తరువాత అఖిల్ దగ్గరకు వెళ్లి హగ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే కోపంలో ఉన్న అఖిల్.. అంటీముట్టనట్లుగా హగ్ ఇచ్చాడు. ఆ తరువాత మోనాల్ వెళ్లిపోగా.. కప్‌బోర్డుని కొట్టి కోపాన్ని తీర్చుకున్నాడు.