AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: నామినేషన్ల పర్వం.. అభి, అవినాష్‌ మధ్య రచ్చ రచ్చ

బిగ్‌బాస్‌ 4లో తొమ్మిదో వారానికి గానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మామూలుగా ప్రతి వారం నామినేషన్ ఒక్క రోజు మాత్రమే ఉండనుండగా

Bigg Boss 4: నామినేషన్ల పర్వం.. అభి, అవినాష్‌ మధ్య రచ్చ రచ్చ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 03, 2020 | 7:46 AM

Share

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌ 4లో తొమ్మిదో వారానికి గానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మామూలుగా ప్రతి వారం నామినేషన్ ఒక్క రోజు మాత్రమే ఉండనుండగా.. ఈసారి రెండు ఎపిసోడ్లకు చేరింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా కోడిగుడ్ల మోత మోగింది.

నామినేషన్‌లో భాగంగా మొదట అరియానా వచ్చి హారికపై మొదటి గుడ్డు కొట్టింది. రాక్షసుల టాస్క్‌లో హారిక ప్రవర్తన నచ్చలేదని అందుకే నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక రెండో గుడ్డును అందరూ ఊహించనట్లే సొహైల్‌పై కొట్టింది. కెప్టెన్‌గా పనిష్మెంట్ ఇస్తే చేయను అన్నావు. అందుకే నిన్ను నామినేట్ చేశా అని చెప్పింది. ఆ సమయంలో ఆ ఇద్దరి మధ్య కాసేపు రచ్చ జరిగింది. ఇది గలీజ్‌ నామినేషన్ అంటూ అరియానాపై చిందులు తొక్కాడు సొహైల్.

ఇక రెండో వ్యక్తిగా అవినాష్‌ పేరును బిగ్‌బాస్ చెప్పగా.. అతడు మొదటి గుడ్డును అభిజిత్‌పై కొట్టాడు. నోయల్‌ చిల్లర కామెడీ అన్నప్పుడు అభి లేచి సీరియస్ అవ్వడం తనకు నచ్చలేదని అవినాష్‌ అన్నాడు. ఇక రెండో గుడ్డును హారికపై పగలగొట్టి.. కేర్‌టేకర్ టాస్క్‌లో సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేదని చెప్పాడు. ( ముంబై దాడి తరహాలో.. ఆస్ట్రియా రాజధానిలో వరుస కాల్పులు)

మూడో వ్యక్తిగా సొహైల్ రాగా.. నాకు అరియానాను నామినేట్ చేయాలని ఉంది. కానీ ఆమె కెప్టెన్ కావడంతో చేయట్లేదు. నెక్ట్స్ వీక్ ఆమె ఉంటే చేస్తా అని చెప్పాడు. ఆ తరువాత మొదటి గుడ్డును మోనాల్‌ తలపై పగలగొట్టాడు. నీ వలనే అఖిల్‌కి, తనకి మధ్య మనస్పర్థలు వస్తున్నాయని, అలాగే టాస్క్‌లలో బాగా ఆడటం లేదని సొహైల్ చెప్పాడు. ఇక రెండో గుడ్డుగా అభిజిత్‌పై కొట్టి.. తనకు అబద్దాల కోరు అని ట్యాగ్ ఇచ్చినప్పుడు.. నువ్వు వచ్చి నీకు అన్ని సెట్ అవుతాయి అని అన్నావు. అందుకే నామినేట్ చేశా అని చెప్పాడు. అయితే తాను మంచి చెబితే నువ్వు మరోలా రిసీవ్ చేసుకున్నావు అని అన్న అభి.. ఇకపై నువ్వు నా మీద జోకులు వేయకు.. నేను నీ మీద వేయను అని అభి అన్నాడు.

తరువాత వచ్చిన అభిజిత్‌.. మొదట అవినాష్‌పై గుడ్డు పగలగొట్టాడు. నువ్వు ఎప్పుడూ నేను ఎంటర్‌టైన్‌మెంట్‌ చేస్తా. హెల్దీ కామెడీ చేస్తా అని అంటావు. కానీ నాకు అలా అనిపించదు. నువ్వు కామెడీ చేయడానికి వచ్చి ఉండొచ్చు. కానీ దాన్ని కామెడీగా తీసుకోవడానికి మేము రెడీగా లేవు. కామెడీ ఆపేస్తే బావుంటుంది అని అవినాష్‌కి చెప్పాడు.

దీంతో అవినాష్‌ కూడా రెచ్చిపోయాడు. నేను వినోదం చేసేందుకు ఇక్కడు వచ్చా. కమెడియన్‌గా ఎంటర్‌టైన్‌ చేయడానికే వచ్చ. ప్రాణం పోయేవరకు పర్ఫామెన్స్ చేస్తా. నన్ను కామెడీ చేయొద్దని చెప్పడానికి నువ్వు ఎవడివి అంటూ ఫైర్ అయ్యాడు. అక్కడితో సోమవారం ఎపిసోడ్‌ పూర్తవ్వగా.. ఇవాళ ఎపిపోడ్‌లో నామినేషన్ల పర్వం కొనసాగనుంది. ( అమెరికాలో హైదరాబాద్‌ వ్యక్తి దారుణ హత్య..!)

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు