AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గత సీజన్ల విన్నర్ల‌ను ఫాలో అవుతున్న సీజన్ 4 కంటెస్టెంట్లు.!

తెలుగు బిగ్ బాస్ ఇప్పటివరకు మూడు సీజన్లు పూర్తి చేసుకుని.. మూడు సీజన్ల విన్నర్స్‌ను బిగ్ బాస్ సీజన్ 4 కొంతమంది కంటెస్టెంట్లు ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది.

గత సీజన్ల విన్నర్ల‌ను ఫాలో అవుతున్న సీజన్ 4 కంటెస్టెంట్లు.!
Ravi Kiran
|

Updated on: Sep 22, 2020 | 11:48 PM

Share

తెలుగు బిగ్ బాస్ ఇప్పటివరకు మూడు సీజన్లు పూర్తి చేసుకుని.. నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టింది. మొదటి సీజన్‌లో శివ బాలాజీ విన్నర్‌గా నిలవగా.. రెండో సీజన్‌లో కౌశల్.. మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్స్‌గా నిలిచారు. ఇక ఈ ముగ్గురి గేమ్ ప్లాన్‌ను బిగ్ బాస్ సీజన్ 4 కొంతమంది కంటెస్టెంట్లు ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. (Bigg Boss 4)

మొదటి సీజన్ విన్నర్ శివ బాలాజీకి కోపం ఎక్కువ. హౌస్‌లో అందరితో కలిసిపోయినట్లు అనిపించినా.. ఏదైనా టాస్క్ లేదా గొడవ జరిగినప్పుడు ఆవేశంతో ఊగిపోయేవారు. ఇక అదే ఆయన్ని విన్నర్‌గా నిలిపిందని కొందరి మాట. సరిగ్గా ఇలాగే ఇప్పుడు హౌస్‌లో ఉన్న కొంతమంది సడన్‌గా హైపర్ అయిపోతారు.. ఆ తర్వాత కాసేపటి కూల్‌గా ఉంటారు.

ఇక సెకండ్ సీజన్ విన్నర్ కౌశల్ గేమ్ ప్లాన్‌ను ఇప్పుడు హౌస్‌లో ఉన్న చాలామంది ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. రెండో వారం వీకెండ్ ఎపిసోడ్స్‌లో ఇది దాదాపుగా అర్ధమవుతుంది. ఎందుకంటే కౌశల్‌కు పెద్దగా గేమ్ ప్లాన్ అంటూ ఏం లేదు. తాను టైటిల్ గెలవడానికి వచ్చానని.. దానికి కోసం ఏదైనా చేయడానికి సిద్దంగా ఉన్నానంటూ చెప్పేవాడు.

ఆ సమయంలో మిగిలిన కంటెస్టెంట్లు అందరూ కూడా అతడ్ని కార్నర్ చేస్తున్నారనే వ్యూ ప్రేక్షకుల్లోకి వెళ్ళడం వల్ల అనూహ్యంగా సింపతీ వల్ల ఒకట్రెండు సందర్భాల్లో ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు హౌస్‌లో ఉన్న పలువురు అదే కోరుకుంటున్నారు. అలాగే మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌ను కూడా ఇద్దరు ముగ్గురు ఫాలో అవుతున్నారని చెప్పొచ్చు. కాగా, ఈ సీజన్‌లో చాలామంది కంటెస్టెంట్లు సేఫ్ గేమ్ ఆడుతున్న విషయం ప్రేక్షకులకు అర్ధమవుతోంది. రెండో వారం వీకెండ్ ఎపిసోడ్‌లో కూడా ఇదే విషయాన్ని నాగార్జున ప్రస్తావించి.. హౌస్ మేట్స్ అందరికి ఓ క్లాస్ పీకిన సంగతి తెలిసిందే.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..