AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్.. కోహ్లీ కళ్లు చెదిరే ఫీల్డింగ్ చూశారా..?

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన ఫీల్డింగ్ మ్యాజిక్ చూపించాడు. సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాల్లోకి డైవ్ చేసి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో నాథన్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న కోహ్లీ విన్యాసం ఈడెన్ పార్క్‌లో అభిమానులను ఆశ్చర్యపరిచింది.

Video: గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్.. కోహ్లీ కళ్లు చెదిరే ఫీల్డింగ్ చూశారా..?
Virat Kohli Catch Video
Venkata Chari
|

Updated on: Nov 04, 2026 | 11:04 AM

Share

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో అతడు పట్టిన అద్భుత క్యాచ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. అన్షుల్ కాంబోజ్ (Anshul Kamboj) బౌలింగ్‌లో నాథన్ స్మిత్ (Nathan Smith) ఇచ్చిన క్యాచ్‌ను గాల్లోకి డైవ్ చేస్తూ అందుకున్నాడు. బంతి నేలను తాకడానికి కొన్ని అంగుళాల ముందే కుడిచేత్తో ఒడిసిపట్టుకున్నాడు. ఈ అద్భుత విన్యాసంతో న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.

29వ ఓవర్లో కోహ్లీ అద్భుతం..

న్యూజిలాండ్ వరుసగా వికెట్లు కోల్పోతున్న సమయంలో భారత బౌలర్లు ఒత్తిడి పెంచారు. ఇన్నింగ్స్ 29వ ఓవర్లో అన్షుల్ కాంబోజ్ వేసిన బంతిని నాథన్ స్మిత్ ఆఫ్ స్టంప్ బయటకు డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బ్యాట్ అంచుకు తగిలిన బంతి సెకండ్ స్లిప్ దిశగా దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ క్షణాల్లో స్పందించాడు. కుడివైపు వేగంగా కదులుతూ గాల్లోకి డైవ్ చేశాడు. తన కుడిచేతిని పూర్తిగా చాపి బంతిని నేలకు తగలకముందే అందుకున్నాడు.

నాథన్ స్మిత్ పెవిలియన్‌కు..

కోహ్లీ అద్భుత క్యాచ్‌తో నాథన్ స్మిత్ ఇన్నింగ్స్ ముగిసింది. అతడు 9 బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ వికెట్‌తో అన్షుల్ కాంబోజ్‌కు రెండో వికెట్ దక్కింది. కీలక సమయంలో వచ్చిన ఈ వికెట్‌తో భారత జట్టు న్యూజిలాండ్‌పై మరింత ఒత్తిడి పెంచింది.

కోహ్లీ సెలబ్రేషన్ అదుర్స్..

క్యాచ్ అందుకున్న వెంటనే కోహ్లీ ఆనందంతో మైదానంలో పరుగులు తీశాడు. ఆ తర్వాత బంతిని అంపైర్‌కు అందిస్తూ తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. చివరగా తన ట్రేడ్‌మార్క్ ‘బో అండ్ యారో’ స్టైల్‌లో సంబరాలు చేసుకున్నాడు. కోహ్లీ ఫీల్డింగ్ విన్యాసానికి భారత అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాడినని కోహ్లీ మరోసారి నిరూపించాడు.

Follow Us