AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: ఛీ ఛీ అన్న అభిజిత్‌.. గుక్కపెట్టి ఏడ్చేసిన సుజాత

బుల్లితెర సెన్సేషన్‌ బిగ్‌బాగ్‌ విజయవంతంగా కొనసాగుతోంది. రెండో ఎపిసోడ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్‌ కాస్త పెరిగింది.

Bigg Boss 4: ఛీ ఛీ అన్న అభిజిత్‌.. గుక్కపెట్టి ఏడ్చేసిన సుజాత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 18, 2020 | 7:40 AM

Share

Bigg Boss 4 Telugu: బుల్లితెర సెన్సేషన్‌ బిగ్‌బాగ్‌ విజయవంతంగా కొనసాగుతోంది. రెండో ఎపిసోడ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్‌ కాస్త పెరిగింది. ఇక బుధవారం బిగ్‌బాస్‌లోకి మరొకరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. వినూత్న ఎంట్రీతో హౌజ్‌లోకి అడుగుపెట్టిన జబర్దస్త్ ముక్కు అవినాష్  అందరినీ స‌ర్‌ప్రైజ్ చేశాడు. వెంటనే మోనాల్‌తో పులిహోర కలిపేందుకు రెడీ అయ్యాడు.  తనకు పెద్ద కుటుంబం ఉందని, తన గురించి ఆలోచించాలంటూ మోనాల్ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నాడు. దీంతో మోనాల్‌ కోసం మరొకరు పోటీ పడబోతున్నట్లు అర్థమైంది. మరోవైపు తన ఆరోగ్యం బాలేదని, తాను వెళ్లిపోతానంటూ గంగవ్వ ఏడ్చేసింది. ఆమెకు ధైర్యం చెప్పిన బిగ్‌బాస్‌ వైద్యుల చేత చికిత్స ఇప్పించారు. ఇక మిగిలిన వివరాల్లోకి వెళ్తే..

ఇక కుటుంబసభ్యులు కల్యాణిని ఏడిపించాలని ప్రాంక్ చేస్తే సుజాత అడ్డంగా దొరకిపోయింది. దీంతో భయపడి, ఏడ్చేయగా.. నోయెల్‌ ఆమెను ఊరడించారు. మళ్లీ ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో ఇంట్లో ఉండే ఒక అబ్బాయిని నువ్వు సెల‌క్ట్ చేసుకోవాలంటూ హారిక‌, సుజాత‌ను అడిగింది. అంద‌రూ అక్క‌, త‌మ్ముడు అవుతారు, పోనీ అభి పేరు చెప్తావా అనగానే అత‌డు.. ఛీఛీ సుజాత. నాకు చెల్లి అని అన్నాడు. దానికి సుజాత నొచ్చుకుంది. ఆ విష‌యాన్ని నోయెల్‌ దగ్గర చెప్తూ ప‌దేప‌దే ఏడ్చింది. మరోవైపు సుజాత, నోయెల్‌తో నీకు, నాకు మధ్య ఏదో ఉంది అంటూ అనుకుంటున్నారు.. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అని అనడంతో.. నోయల్ నిన్ను సిస్టర్‌లా చూస్తున్నా.. నీకు కూడా ఆ విషయం తెలుసు వాళ్లను పట్టించుకోకు అని క్లారిటీ ఇచ్చాడు. ఆ తరువాత సుజాత, అభిజిత్‌ దగ్గరకు వెళ్లి.. నువ్వు చెల్లి అనే పదం వాడటం తప్పు కాదు. కాని విధానం తప్పు అంటూ ఫీల్ అయ్యింది.

ఇదిలా ఉంటే గ‌త కొద్దిరోజులుగా తనను బయటకు పంపాలంటూ వేడుకుంటున్న‌ గంగ‌వ్వ అనారోగ్యం బారిన ప‌డింది. దీంతో బిగ్‌బాస్ ఆమెను క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచి, ఆరోగ్యం ఎలా ఉంద‌ని అడిగాడు. అయితే ఇక్కడ అంద‌రూ బాగానే చూసుకుంటున్నారని, కానీ భ‌ర్త కొట్టిన దెబ్బ‌లు ఇప్పుడు మ‌ళ్లీ  నొప్పెడుతున్నాయ‌ని, తనకిక్క‌డ వాతావార‌ణం, ఆహారం ప‌డ‌టం లేదని ఏడ్చేసింది. మ‌ట్టిలో స్వేచ్చగా తిరిగేదాన్ని, ఇక్క‌డ ఉండ‌లేక‌పోతున్నాన‌ంటూ చెప్పింది. రెండు నెల‌లు ఉందామ‌నుకున్నా, కానీ త‌న వ‌ల్ల కావ‌ట్లేదంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. అయితే మీరు గ‌ట్టిమ‌నిషిని, ఇలాంటి ఎన్నో క‌ష్టాలను చూసి ఇక్క‌డిదాకా వ‌చ్చారని బిగ్‌బాస్ ధైర్యం నూరిపోశారు. అయినా తాను ఉండలేనంటూ గంగవ్వ చెప్పింది. ఇక ఆమెను మెడిక‌ల్ రూమ్‌కు వెళ్ల‌మ‌ని చెప్పిన బిగ్‌బాస్‌ అక్క‌డ వైద్యుల‌తో చికిత్స అందించారు. ఇక బిగ్‌బాస్‌ కామెడీ షోలో భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన అవినాష్, కుమార్ సాయిలు రెండు టీంలుగా విడిపోయి కామెడీ స్కిట్‌లు చేయాలని.. మిగిలిన సభ్యులు మధ్యలో యాడ్స్ చేయాలని బిగ్‌బాస్‌ టాస్క్ ఇచ్చారు.

Read More:

ఏపీలో 1,658 మంది ఖైదీలకు కరోనా.. కడప జైల్‌లో అత్యధిక కేసులు

ఘనంగా ఎంగిలిపూవు బతుకమ్మ సంబురాలు

Follow Us