ఘనంగా ఎంగిలిపూవు బతుకమ్మ సంబురాలు

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ఘనంగా మొదలైంది. తీరొక్క పూలతో అంగరంగ తీర్చిదిద్దిన బతుకమ్మలు కొలువుదీరాయి.

ఘనంగా ఎంగిలిపూవు బతుకమ్మ సంబురాలు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Sep 18, 2020 | 12:57 AM

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ఘనంగా మొదలైంది. తీరొక్క పూలతో అంగరంగ తీర్చిదిద్దిన బతుకమ్మలు కొలువుదీరాయి. బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎంగిలి పూవ్వు పండుగను తెలంగాణలో సంబురంగా షురూ అయ్యాయి. వేములవాడ పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను గురువారం వైభవంగా జరుపుకున్నారు. మహిళలు పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను అలంకరించారు. కరోనా మహమ్మారిని సైతం లెక్క చేయకుండా సాయంత్రం ఆయా కూడళ్లలో ఆటపాటలతో హోరెత్తించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ కోలాహలంగా పండుగను జరుపుకున్నారు. గుడి చెరువు, బతుకమ్మ తెప్ప వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేశారు. రాష్ట్రంలో జరిగే వేడుకలకు భిన్నంగా వేములవాడలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహించనున్నారు.

అటు రాష్ట్రవ్యాప్తంగా ఎంగిలి పూవు బతుకమ్మను ఆడపడుచులు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు సంప్రదాయరీతిలో ఆడిపాడారు. కాగా, ఈ ఏడాది అధికమాసం రావడంతో ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించి వచ్చే నెల 17 నుండి మళ్లీ యథావిధిగా బతుకమ్మ వేడుకలు జరుపుకోనున్నారు. అయితే, మహిళలు అటు పుట్టినింట్లో ఇటు మెట్టినింట్లో రెండు చోట్ల వేడుకలు జరుపుకునే అవకాశం కలిగింది. రాష్ట్రమంతా అక్టోబర్ 22 తేదిన సద్దుల బతుకమ్మ వేడుకలు జరపనున్నారు.