Bigg Boss4 : మోనాల్‌ను ముద్దడిగిన అవినాష్.. అన్నలాంటివాడివంటూ పంచ్ వేసిన అఖిల్
బిగ్ బాస్4 రసవత్తరంగా సాగుతుంది. వారాంతం వచ్చిందంటే చాలు బిగ్ బాస్ హౌస్ లో హంగామా మాములుగా ఉండదు. ఆదివారం నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తూ హౌస్ మేట్స్ లో కొత్త ఉత్సాహం నింపుతారు.
బిగ్ బాస్4 రసవత్తరంగా సాగుతుంది. వారాంతం వచ్చిందంటే చాలు బిగ్ బాస్ హౌస్ లో హంగామా మాములుగా ఉండదు. ఆదివారం నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తూ హౌస్ మేట్స్ లో కొత్త ఉత్సాహం నింపుతారు. వారం మొత్తం మీద హౌస్ లో జరిగిన వాటి పై చర్చ పెట్టి హౌస్ మేట్స్ కు క్లాస్ తీసుకుంటూ.. వారితో ఆటలు ఆడిస్తూ హంగామా చేస్తారు. ఈ శనివారం నాగార్జున ఇంట్లో సభ్యులందరికీ గట్టి క్లాసే తీసుకున్నారు. అయితే సండే మాత్రం ఫండే గా మార్చాడు నాగ్.
ఇక ఆటలో భాగంగా అందరికీ వైట్ బోర్డులుఇచ్చిన నాగార్జున. ఒక్కో ఇంటి సభ్యుడిని లేపి మూడు ప్రశ్నలు వేశారు. నిలబడిన సభ్యుడు నాగార్జున అడిగిన ప్రశ్నలకు బోర్డుపై సమాధానాలు రాస్తాడు. అతను ఏం రాస్తాడో ఊహించి మిగిలిన ఇంటి సభ్యులు తమ బోర్డులపై సమాధానాలు రాస్తారు. నిలబడిన వ్యక్తి సమాధానంతో ఎవరి సమాధానాలు మ్యాచ్ అవుతాయో వారికి నిలబడిన వ్యక్తి ఒక రోజా పువ్వు ఇస్తాడు. ఆట ముగిసే సమయానికి ఎవరి వద్ద ఎక్కువ పువ్వులు ఉంటే వారు ‘యారోం కి యార్’ అంటూ చెప్పాడు నాగ్. ముందుగా మోనాల్ ను లేపిన నాగ్ ‘‘నువ్వు అవినాష్‌ను ఎన్నిసార్లు ముద్దుపెట్టుకున్నావ్’’ అని అడిగాడు. దానికి మోనాల్ మూడు సార్లు అని రాసింది. అవినాష్ కూడా మూడు సార్లు అంటూ బోర్డు పైన రాసాడు. దాంతో అవినాష్ కు పువ్వు ఇచ్చింది. అయితే నాలుగో ముద్దుకూడా ఇవ్వమనండి సార్ అంటూ నాగార్జునను అడిగాడు అవినాష్. మోనాల్ నీ ఇష్టం పువ్వుతోపాటు ముద్దుకూడా ఇవ్వొచ్చు అని నాగ్ చెప్పారు. కానీ మోనాల్ నవ్వుతూ పువ్వుమాత్రమే ఇచ్చింది. అవినాష్-మోనాల్‌లది అన్న చెల్లెళ్ల అనుబంధం అని అఖిల్, సోహెల్ జోకులేశారు. దానికి నాగ్ మోనాల్ కు అవినాష్ అన్న కాదు నాన్న అంటూ పంచ్ వేశారు నాగార్జున.