Bigg Boss 4: ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా మాట్లాడు.. అభిజిత్‌కి మోనాల్ సోదరి క్లాస్‌.. హర్ట్‌ అయిన అభి, హారిక

బిగ్‌బాస్‌ హౌజ్‌ గత రెండు రోజులుగా ఎమోషనల్‌గా మారింది. కంటెస్టెంట్‌ల ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌లోకి వచ్చారు. కరోనా నేపథ్యంలో ఓ గాజు గోడ బయటి నుంచే వారిని మాట్లాడించారు

Bigg Boss 4: ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా మాట్లాడు.. అభిజిత్‌కి మోనాల్ సోదరి క్లాస్‌.. హర్ట్‌ అయిన అభి, హారిక
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 20, 2020 | 7:36 AM

Bigg Boss Monal sister: బిగ్‌బాస్‌ హౌజ్‌ గత రెండు రోజులుగా ఎమోషనల్‌గా మారింది. కంటెస్టెంట్‌ల ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌లోకి వచ్చారు. కరోనా నేపథ్యంలో ఓ గాజు గోడ బయటి నుంచే వారిని మాట్లాడించారు. ఈ క్రమంలో మోనాల్‌ గజ్జర్ సోదరి హిమలి గురువారం హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట మోనాల్‌ తల్లి వాయిస్ వినిపించగా.. ఎమోషనల్‌ అయిపోయిన ఆమె బాత్‌రూమ్‌లోకి వెళ్లి గట్టిగా ఏడ్చేసింది. తన కోసం ఎవరూ రాలేదేమోనని కన్నీళ్లు పెట్టుకుంది. అదే సమయంలో హిమలి వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ఈ సందర్భంగా మోనాల్‌ ఇంకా ఏడ్చేసింది. అమ్మ ఎలా ఉంది..? ఎలా ఉన్నావు..? కునాల్‌తో మాట్లాడావా..? నా గురించి బయట చెడుగా అనుకోట్లేదు కదా..? అంటూ వరుస ప్రశ్నలు సంధించింది మోనాల్‌. దానికి కొంచెం ఆగు అని చేయి చూపిస్తూ.. నువ్వు బాగా ఆడు కచ్చితంగా విన్నర్‌ అవుతావు అని తెలిపింది. ప్రతిసారి ఏడవకు. ఇంకోసారి ఏడిస్తే కొడతా అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా హౌజ్‌మేట్స్‌తోనూ హిమలి మాట్లాడింది. అందరితో బాగానే మాట్లాడినప్పటికీ.. అభిజిత్‌కి క్లాస్‌ పీకింది. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా మాట్లాడు. వెనుక ఒక మాట, ముందు ఒక మాట మాట్లాడకు. మోనాల్‌తో ఎక్కువగా మాట్లాడు అంటూ ఏదో చెప్పుకొచ్చింది. దీంతో అభిజిత్‌ బాగా ఫీల్‌ అయ్యాడు. అభిజిత్‌ని అనడంతో హారిక కూడా ఫీల్‌ అయ్యింది. అభిజిత్‌.. ముందు, వెనుకాల ఎప్పుడూ ఒకేలా మాట్లాడతాడని చెబుతూ ఫీల్‌ అయ్యింది.

మరోవైపు అక్క వచ్చి వెళ్లిన తరువాత అఖిల్‌, సొహైల్‌లకి మోనాల్‌ గట్టి హగ్‌ ఇచ్చింది. అఖిల్‌ అయితే మీ సిస్టర్‌ బాగా స్ట్రైట్‌ ఫార్వర్డ్‌, నాకు బాగా నచ్చేసింది అంటూ పులిహోర స్టార్ట్ చేశాడు.

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?