Bigg Boss 4: ఏంటిది బిగ్‌బాస్ అంటూ.. హౌజ్‌లో తొలిసారిగా అభిజిత్ ఎమోషనల్‌.. ఓదార్చిన హారిక

బిగ్‌బాస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా కన్నీళ్లు పెట్టని అభిజిత్‌.. బుధవారం నాటి ఎపిసోడ్‌లో తొలిసారి ఎమోషనల్‌ అయ్యారు

Bigg Boss 4: ఏంటిది బిగ్‌బాస్ అంటూ.. హౌజ్‌లో తొలిసారిగా అభిజిత్ ఎమోషనల్‌.. ఓదార్చిన హారిక
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 26, 2020 | 7:22 AM

Bigg Boss 4 Abhijeet: బిగ్‌బాస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా కన్నీళ్లు పెట్టని అభిజిత్‌.. బుధవారం నాటి ఎపిసోడ్‌లో తొలిసారి ఎమోషనల్‌ అయ్యారు. అభిజిత్‌, అఖిల్‌ మోనాల్‌లను బాగా ఏడిపించారని, అందుకే వీరిద్దరిలో ఒకరు ఆమెతో డేట్‌కి వెళ్లాలని బిగ్‌బాస్ సూచించాడు. దానికోసం ఓ క్విజ్‌ కాంపిటేషన్‌ కూడా పెడతామని, అందులో గెలిస్తేనే మోనాల్‌తో డేట్‌కి వెళ్తారని బిగ్‌బాస్ లెటర్ పంపాడు.

దీనిపై అభి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. మోనాల్‌తో నాకు ఎలాంటి లింక్ పెట్టకండి అని చెప్తూ ఉన్నా..? అయినా మళ్లీ డేట్ ఏంటి..? నేను తనను ఏడిపించడం ఏంటి..? నాకు ఈ టాస్క్‌ వద్దు. దీనికి నేను ఒప్పుకుంటే ఆమెను ఏడిపించానని ఒప్పుకున్నట్లు. అసలు మోనాల్‌ టాపిక్‌ నా దగ్గరకు రాకూడదు అనుకుంటున్నా. మేం ఇద్దరం కలిసి మోనాల్‌ని ఏడిపించడం ఏంటి. ఇదేదో బిగ్‌ డీల్‌లా కనిపిస్తోంది. నాకు ఎక్కడో కొడుతోంది బిగ్‌బాస్‌. నాకు మోనాల్ అభిజిత్‌ అన్న ప్రజెక్షన్ వద్దు. మోనాల్‌ టాపిక్‌ తీసుకురావొద్దని అఖిల్‌తో చెప్పా. మోనాల్‌ టాపిక్‌ వచ్చిందంటే నాకు రాడ్‌ పడుతోంది.

ఈ జర్నీ మొత్తంలో మోనాల్‌ టాపిక్‌ బిస్కట్‌ అవుతోంది. నేను మోనాల్‌తో డేట్‌కి వెళ్లలేను. ఈ టాస్క్‌ నాకు వద్దు బిగ్‌బాస్ అంటూ అభి ఎమోషనల్‌ అయ్యాడు. అయితే లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో భాగంగా.. దీన్ని చేయడం మీ బాధ్యత అని బిగ్‌బాస్‌ చెప్పుకొచ్చాడు. ఇక అభి నేను చేయలేనని చెప్పడంతో అఖిల్, టాస్క్‌ని కంప్లీట్ చేయాలని చెప్పారు. ఇక అభి కన్నీళ్లు పెట్టుకోవడంతో.. హారిక, సొహైల్‌ ఓదార్చారు. ఇక్కడ నా బేబీ కాదంటూ అభిజిత్‌ని హారిక దగ్గరకు తీసుకుంది. చివర్లో వచ్చిన అఖిల్‌.. ఏమైంది బ్రదర్‌ ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా.. మనమిద్దరం మోనాల్‌ని ఏడిపించామనే ఫ్రేమింగ్‌ నచ్చలేదని చెప్పాడు. దానికి అఖిల్‌.. అవును బ్రదర్ నాక్కూడా అని చెప్పడం విశేషం. మరి అలాంటప్పుడు టాస్క్ చేస్తానని ఎందుకు ఒప్పుకున్నాడో ఎవ్వరికీ తెలీడం లేదు.