AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌బాస్‌4 హోస్ట్‌‌గా ఎవరు ఉండబోతున్నారో తెలుసా..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌3.. 15 వారాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించి.. ఆదివారంతో ముగిసింది. ఈ సీజన్‌కి హోస్ట్‌గా అక్కినేని నాగార్జున వ్యవహరించారు. ఆదివారం జరిగిన బిగ్‌బాస్3 గ్రాండ్ ఫినాలేకి.. ముఖ్యఅతిథిగా మెగస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఈ సీజన్‌కు విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్‌కు మెగాస్టార్ చిరు టైటిల్‌ను అందజేశారు. అయితే బిగ్‌బాస్‌3 షో ముగిసి 24 గంటలు కూడా గడవకముందే.. అప్పుడే బిగ్‌బాస్‌4 చర్చ మొదలైంది. అంతేకాదు.. ఈ షోకు హోస్ట్‌గా ఎవరు […]

బిగ్‌బాస్‌4 హోస్ట్‌‌గా ఎవరు ఉండబోతున్నారో తెలుసా..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 04, 2019 | 4:12 PM

Share

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌3.. 15 వారాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించి.. ఆదివారంతో ముగిసింది. ఈ సీజన్‌కి హోస్ట్‌గా అక్కినేని నాగార్జున వ్యవహరించారు. ఆదివారం జరిగిన బిగ్‌బాస్3 గ్రాండ్ ఫినాలేకి.. ముఖ్యఅతిథిగా మెగస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఈ సీజన్‌కు విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్‌కు మెగాస్టార్ చిరు టైటిల్‌ను అందజేశారు.

అయితే బిగ్‌బాస్‌3 షో ముగిసి 24 గంటలు కూడా గడవకముందే.. అప్పుడే బిగ్‌బాస్‌4 చర్చ మొదలైంది. అంతేకాదు.. ఈ షోకు హోస్ట్‌గా ఎవరు వ్యవహరించబోతున్నారన్న దానిపై కూడా రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా వస్తున్న సమాచారం మేరకు.. బిగ్‌బాస్4 సీజన్‌కు మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. మొదట బిగ్‌బాస్ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా.. రెండవ సీజన్‌కు నాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా ఉన్నాడు. అయితే సీజన్‌4కు చిరు ఉండబోతున్నారన్న వార్తలు వైరల్‌గా మారాయి. ఈ సారి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4కి హోస్ట్‌గా మెగాస్టార్ చేస్తున్నారని.. అందుకే నిన్న జరిగిన సీజన్ 3 ఫైనల్‌కి చిరు వచ్చారంటూ సోషల్ మీడియాలో న్యూస్‌ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Follow Us
శనిదేవుడి కటాక్షం..30 ఏళ్ల తర్వాత వారి జాతకం మారనుంది..!
శనిదేవుడి కటాక్షం..30 ఏళ్ల తర్వాత వారి జాతకం మారనుంది..!
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్