బయోపిక్‌లో బిగ్ బాస్ బ్యూటీ!

నేచురల్ స్టార్ నాని హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో ఇంటి సభ్యులందరికి గారాల పట్టిగా పేరు తెచ్చుకుంది దీప్తి సునైనా. తాజాగా ఆమె తన ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తన తొలి చిత్రం ‘అలియా ఖాన్’ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ బట్టి చూస్తే.. పాకిస్థాన్ ఫిమేల్ యాక్టివిస్ట్, నోబెల్ ప్రైజ్ విన్నర్ మలాలా యూసఫ్‌జాయ్ జీవితకథ ఆధారంగా ఈ […]

  • Ravi Kiran
  • Publish Date - 2:52 am, Mon, 14 October 19
బయోపిక్‌లో బిగ్ బాస్ బ్యూటీ!

నేచురల్ స్టార్ నాని హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో ఇంటి సభ్యులందరికి గారాల పట్టిగా పేరు తెచ్చుకుంది దీప్తి సునైనా. తాజాగా ఆమె తన ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తన తొలి చిత్రం ‘అలియా ఖాన్’ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.

ఫస్ట్ లుక్ పోస్టర్ బట్టి చూస్తే.. పాకిస్థాన్ ఫిమేల్ యాక్టివిస్ట్, నోబెల్ ప్రైజ్ విన్నర్ మలాలా యూసఫ్‌జాయ్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి జిఎస్ రాజ్ కుమార్ దర్శకుడు కాగా.. ఛోటా థియేటర్ బ్యానర్‌పై తేజేస్కర్ రెడ్డి, భరత్ సోమి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.