హౌస్‌లో తమన్నాతో తలనొప్పి.. అలర్ట్ టీం రెడీగా ఉంచాలంటూ ‘బిగ్‌బాస్’కు..
వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో ‘బిగ్‌బాస్ 3’ హౌస్‌లోకి వచ్చిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి తన వైల్డ్‌నెస్ మొత్తాన్ని చూపిస్తోంది. హౌస్‌లో జాయిన్ అయినప్పటి నుంచి అందరి మధ్య చిచ్చులు పెడుతోన్న ఈమె.. ఇటీవల సీరియల్ నటుడు రవికృష్ణను టార్గెట్ చేసింది. గత మూడు రోజులుగా అతడిపై వ్యక్తిగత దూషణలు చేస్తూ.. తన ప్రవర్తనతో అందరికీ విసుగును తెప్పిస్తోంది. ఇక ఎవరైనా ఎదురు తిరిగితే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ బూతు పురాణం విప్పుతోంది. దీంతో వచ్చే ఎలిమినేషన్‌లో తమన్నా ఔట్ అవ్వడం […]
వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో ‘బిగ్‌బాస్ 3’ హౌస్‌లోకి వచ్చిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి తన వైల్డ్‌నెస్ మొత్తాన్ని చూపిస్తోంది. హౌస్‌లో జాయిన్ అయినప్పటి నుంచి అందరి మధ్య చిచ్చులు పెడుతోన్న ఈమె.. ఇటీవల సీరియల్ నటుడు రవికృష్ణను టార్గెట్ చేసింది. గత మూడు రోజులుగా అతడిపై వ్యక్తిగత దూషణలు చేస్తూ.. తన ప్రవర్తనతో అందరికీ విసుగును తెప్పిస్తోంది. ఇక ఎవరైనా ఎదురు తిరిగితే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ బూతు పురాణం విప్పుతోంది. దీంతో వచ్చే ఎలిమినేషన్‌లో తమన్నా ఔట్ అవ్వడం ఖాయమని స్పష్టంగా అర్థమవుతోంది.
ఇదిలా ఉంటే రవికృష్ణను తమన్నా టార్గెట్ చేయడంపై ‘బిగ్‌బాస్ 2’ కంటెస్టెంట్, కామన్‌మన్ నూతన్ నాయుడు స్పందించాడు. ఆమె ప్రవర్తనతో హౌస్‌లో ప్రమాదకర పరిస్థితి నెలకొందని హెచ్చరించాడు. ఈ మేరకు యూట్యూబ్‌లో వీడియో విడుదల చేసిన నూతన నాయుడు.. ప్రస్తుతం షోను గమనిస్తే పరిస్థితి చేయిజారిపోయినట్లు కనిపిస్తోందని.. ఏ క్షణాన ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నాడు.
ఓ సైకాలజిస్ట్‌గా ట్రాన్స్‌జెండర్ తమన్నా ప్రవర్తనను తాను గమనించానని.. ఆమె హౌస్‌లో ఉన్న వారిపై భౌతిక దాడికి పాల్పడే అవకాశం ఉందని అన్నాడు. ఎదుటి వ్యక్తులపై దాడి చేయడం గానీ.. లేదంటే మానసిక స్థిరత్వం కోల్పోయి తనకు తాను హాని చేసుకోవడం గానీ జరగొచ్చని చెప్పుకొచ్చాడు. అందుకే ‘‘బిగ్‌బాస్ మీరు హెల్త్ టీంను అలర్ట్ చేసి ఉంచండి. ఎమర్జెన్సీని యాక్టివేట్ చేసి ఉంచండి. జాగ్రత్తగా వ్యవహరించకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది’’ అని హెచ్చరించాడు.