‘బిగ్‌బాస్‌ 3’ని ఆపాల్సిందే.. కన్నా ఫైర్

పలు వివాదాలతో గత కొన్ని రోజులుగా హాట్‌ టాపిక్‌గా నడిచిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ 3’ ఆదివారం స్టార్‌ మాలో అట్టహాసంగా ప్రారంభమైంది. నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షోలో మొత్తం 15మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో శ్రీముఖి, శివజ్యోతి అలియాస్ సావిత్రక్క, రవి కృష్ణ, అలీ రజీ, జాఫర్, హిమజ, రోహిణి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, వితికా శేరు, అషు రెడ్డి, రాహుల్ సింప్లిగజ్, పుపర్నవి భూపాలం, హేమ, మహేష్ విట్టా […]

‘బిగ్‌బాస్‌ 3’ని ఆపాల్సిందే.. కన్నా ఫైర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 22, 2019 | 11:17 AM

పలు వివాదాలతో గత కొన్ని రోజులుగా హాట్‌ టాపిక్‌గా నడిచిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ 3’ ఆదివారం స్టార్‌ మాలో అట్టహాసంగా ప్రారంభమైంది. నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షోలో మొత్తం 15మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో శ్రీముఖి, శివజ్యోతి అలియాస్ సావిత్రక్క, రవి కృష్ణ, అలీ రజీ, జాఫర్, హిమజ, రోహిణి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, వితికా శేరు, అషు రెడ్డి, రాహుల్ సింప్లిగజ్, పుపర్నవి భూపాలం, హేమ, మహేష్ విట్టా ఉన్నారు.

అయితే ఈ షోపై ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా ఈ షోను ఆపివేయాలంటూ ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అందులో ‘‘బిగ్‌బాస్ సిరీస్‌పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ షో భారతీయ సంప్రదాయాలకు, మహిళల ఆత్మగౌరవాన్ని భంగం కలిగించి యువతకు పక్కదారి పట్టించేలా ఉంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా ఈ షో ప్రసారం కాకుండా పర్మిషన్ రద్దు చేయాలని విఙ్ఞప్తి చేస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. దీనికి ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎంవోను ఆయన ట్యాగ్ చేశారు.

https://twitter.com/klnbjp/status/1153113715941597184