నో కాంట్రోవర్శీ..’బిగ్ బాస్ 3′ స్టార్ట్

బిగ్ బాస్ రియాలిటీ షో..దీని గురించి స్పెషల్‌గా చెప్పేది ఏముంది?. అందర్ని అలరిస్తుంది కాబట్టే ఇన్ని భాషలకు విస్తరించింది. ఇంతమంది అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తుంది. గత నెలనెలరోజులుగా బిగ్ బాస్ 3 సంబంధించిన ప్రతి అబ్డేట్‌కి  వీక్షకులు తెగ ఇంట్రస్ట్ చూపించారు. మొత్తానికి బుల్లి తెర ప్రేక్షకుల్ని గత రెండు సీజన్లుగా అలరిస్తున్న బిగ్ బాస్ మూడో సీజన్‌కి ఎంట్రీ ఇచ్చేసింది.  కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఆదివారం […]

నో కాంట్రోవర్శీ..'బిగ్ బాస్ 3' స్టార్ట్
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 22, 2019 | 11:58 AM

బిగ్ బాస్ రియాలిటీ షో..దీని గురించి స్పెషల్‌గా చెప్పేది ఏముంది?. అందర్ని అలరిస్తుంది కాబట్టే ఇన్ని భాషలకు విస్తరించింది. ఇంతమంది అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తుంది. గత నెలనెలరోజులుగా బిగ్ బాస్ 3 సంబంధించిన ప్రతి అబ్డేట్‌కి  వీక్షకులు తెగ ఇంట్రస్ట్ చూపించారు. మొత్తానికి బుల్లి తెర ప్రేక్షకుల్ని గత రెండు సీజన్లుగా అలరిస్తున్న బిగ్ బాస్ మూడో సీజన్‌కి ఎంట్రీ ఇచ్చేసింది.  కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఆదివారం రాత్రి (జూలై 21) 9 గంటలకు స్టార్ మాలో ప్రారంభమైంది.

అయితే భారీ అంచనాల మధ్య స్టార్ట్ అయిన ఈ సీజన్ కు ముందే వివాదాలు చుట్టుముట్టాయి. కింగ్ నాగార్జున ఈ షోను చేయకూడదన్న ఓయూ విద్యార్థి సంఘాల పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి. నాగ్ ఇంటిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. కౌస్టింగ్ కౌచ్ ఆరోపణలో జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి,  అవకాశం పేరుతో తనను మోసం చేశారని నటి గాయత్రి గుప్తా కేసులు పెట్టడమే కాదు..ఏకంగా ఢిల్లీ స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో నేషనల్ మీడియాలో కూడా బిగ్ బాస్‌ 3 తెలుగుపై చర్చ నడిచింది. దీంతో నాగ్ ఈ షో నుంచి తప్పుకున్నారని, అసలు షోనే రద్దు కానుందని రూమర్స్ వచ్చాయి.

వీటిని లైట్‌గా తీసుకున్న నిర్వాహకులు ఎట్టకేలకు అనుకున్న సమయానికి బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్  చేశారు. ఊహించిన దానికంటే భారీ రేటింగ్ సాధించింది. ఫస్ట్ సీజన్‌లో ఎన్టీఆర్ హోస్ట్‌గా అదరగొడితే..సెకండ్ సీజన్‌లో నాని హుందాగా ముందుకు నడిపించారు.  ఇక సీజన్ 3లో ‘నడిచే స్టైల్ ఏమో రాకింగ్’ అంటూ కింగ్ సాంగ్‌తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన నాగ్..షో కి కొత్త గ్లామర్ లుక్‌ని ఇచ్చారు. గతంలో టీవీ షో హోస్ట్‌గా అనుభవం ఉండటంతో..నాగ్ బిగ్ బాస్ 3 ని మరో రేంజ్‌కి తీసుకెళ్తారనడంతో ఎటువంటి సందేహం లేదు. 15 మంది సెలబ్రిటీలు స్పెషల్ ఎంట్రీలతో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.  ఈ షో 100 రోజులపాటు బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచనుంది.