‘బిగ్‌బాస్’ వివాదం.. విచారణ వాయిదా

‘బిగ్‌బాస్’ షోను నిలిపివేయాలంటూ దాఖలైన పిల్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అయితే బ్రాడ్‌కాస్టింగ్ నిబంధనలకు విరుద్ధంగా షో ప్రసారం చేస్తున్నారని.. దీనిని నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌ షోను సెన్సార్ చేయాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు అందులో నాగార్జునతో పాటు మరో పదిమందిని […]

‘బిగ్‌బాస్’ వివాదం.. విచారణ వాయిదా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 22, 2019 | 2:04 PM

‘బిగ్‌బాస్’ షోను నిలిపివేయాలంటూ దాఖలైన పిల్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అయితే బ్రాడ్‌కాస్టింగ్ నిబంధనలకు విరుద్ధంగా షో ప్రసారం చేస్తున్నారని.. దీనిని నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌ షోను సెన్సార్ చేయాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అంతేకాదు అందులో నాగార్జునతో పాటు మరో పదిమందిని కేతిరెడ్డి ప్రతివాదులుగా చేర్చారు. సినిమాలకు ఎలా సెన్సారో చేస్తారో అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న ఈ బిగ్‌బాస్ గేమ్ షో కూడా సెన్సార్ చేయాలని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోర్టును కోరారు. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ చట్టాలను అనుచరించి ఈ షోపై చర్యలు తీసుకోవాలని తన వాజ్యంలో పేర్కొన్నారు. కాగా ప్రారంభానికి ముందు ఎన్ని వివాదాలు నడిచినా.. గత రాత్రి బిగ్‌బాస్ అట్టహాసంగా ప్రారంభమైంది. బుల్లితెర, వెండితెరకు చెందిన 15మంది హౌస్‌లో చేసే సందడిని వీక్షకులు ఇవాళ్టి నుంచి చూడనున్నారు.