‘బిగ్ బాస్ 3’షోలో అషు రెడ్డి లుక్.. మిక్స్‌డ్ రియాక్షన్స్!

ఎన్నో వివాదాలు.. మరెన్నో సంచలనాల నడుమ తెలుగు ‘బిగ్ బాస్ 3’ ఆదివారం ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోలో సోషల్ మీడియా సెలబ్రిటీ, జూనియర్ సమంతా అని పిలవబడే.. ‘అషు రెడ్డి’ మూడో కంటెస్టెంట్‌గా ఎంటరైన సంగతి తెలిసిందే. ఇక ఆమె ఎంట్రీ చూసిన జనం అందరూ కూడా షాక్ తిన్నారు. అందుకు కారణం.. ఆమె సమంతా లుక్‌లో కన్నా స్లిమ్‌గా కాకుండా నటి నమితలా బొద్దుగా ఉండడమే. దీనితో కొంతమంది […]

'బిగ్ బాస్ 3'షోలో అషు రెడ్డి లుక్.. మిక్స్‌డ్ రియాక్షన్స్!
Ravi Kiran

|

Jul 22, 2019 | 4:49 PM

ఎన్నో వివాదాలు.. మరెన్నో సంచలనాల నడుమ తెలుగు ‘బిగ్ బాస్ 3’ ఆదివారం ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోలో సోషల్ మీడియా సెలబ్రిటీ, జూనియర్ సమంతా అని పిలవబడే.. ‘అషు రెడ్డి’ మూడో కంటెస్టెంట్‌గా ఎంటరైన సంగతి తెలిసిందే. ఇక ఆమె ఎంట్రీ చూసిన జనం అందరూ కూడా షాక్ తిన్నారు. అందుకు కారణం.. ఆమె సమంతా లుక్‌లో కన్నా స్లిమ్‌గా కాకుండా నటి నమితలా బొద్దుగా ఉండడమే.

దీనితో కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ‘ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఇన్ని రోజులు స్లిమ్ ఫిల్టర్లు యూజ్ చేసేదేమో.. కానీ స్టార్ మా కెమెరాల్లో ఆ ఫిల్టర్ లేదు. అందుకే ఆమె నిజమైన రూపం అందరికీ తెలిసిపోయింది. ఇన్ని రోజులూ తన ఫేక్ లుక్ చూపించి ఇంటర్నెట్లో అందరినీ బురిడీ కొట్టించిందని’ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా కొంతమంది మాత్రం ఆమెకు మద్దతు తెలిపారు. ‘చాలా మంది అషు రెడ్డి బరువు గురించి మాట్లాడుతున్నారు. కొందరు మహిళలు కూడా ఈ విషయాలను చర్చిస్తున్నారు. ఇంతకంటే చీప్ ఏమి ఉండదు. ఇలాంటి షోలు చూడటమే కాదు… దానిపై విశ్లేషణ ఇవ్వడం కూడా దురదృష్టకరం” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

‘అషు రెడ్డిపై జరుగుతున్న ట్రోల్స్ చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక మహిళ బరువు పెరిగినంత మాత్రాన డీగ్రేడ్ చేసి మాట్లాడడం సరికాదని.. అటు జనాలు కూడా రకరకాల విషయాలపై పలు విధాలుగా స్పందిస్తారని ఇప్పుడే తెలుస్తోందని మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu