‘సింబా’ సింహ గర్జన..బాక్సాఫీస్ వద్ద హంగామా!

జంగిల్ బుక్ త‌ర్వాత మ‌రోసారి అదే ద‌ర్శ‌కుడి నుంచి వ‌చ్చిన ల‌య‌న్ కింగ్ రికార్డులు తిర‌గ‌రాస్తూ ముందుకు దూసుకెళ్లిపోతుంది. పల్లెటూర్లలో లైన్ కింగ్ సినిమాకి ఆదరణ ఉంటుందని ఎవరైనా అనుకుంటారా?. కానీ సీన్ రివర్స్ అయింది. విలేజస్‌లో కూడా ఈ హాలీవుడ్ మూవీ సత్తా చాటుతుంది. అనూహ్యంగా థియేటర్లన్నీ నిండిపోతున్నాయి. ఇక సిటీస్‌లో మూవీ క్రేజ్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా  54.75 కోట్ల‌ు కొల్లగొట్టింది. అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్, […]

'సింబా' సింహ గర్జన..బాక్సాఫీస్ వద్ద హంగామా!
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 22, 2019 | 4:26 PM

జంగిల్ బుక్ త‌ర్వాత మ‌రోసారి అదే ద‌ర్శ‌కుడి నుంచి వ‌చ్చిన ల‌య‌న్ కింగ్ రికార్డులు తిర‌గ‌రాస్తూ ముందుకు దూసుకెళ్లిపోతుంది. పల్లెటూర్లలో లైన్ కింగ్ సినిమాకి ఆదరణ ఉంటుందని ఎవరైనా అనుకుంటారా?. కానీ సీన్ రివర్స్ అయింది. విలేజస్‌లో కూడా ఈ హాలీవుడ్ మూవీ సత్తా చాటుతుంది. అనూహ్యంగా థియేటర్లన్నీ నిండిపోతున్నాయి. ఇక సిటీస్‌లో మూవీ క్రేజ్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా  54.75 కోట్ల‌ు కొల్లగొట్టింది. అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్, కెప్టెన్ మార్వెల్ త‌ర్వాత 2019లో ఇండియాలో అత్య‌ధిక ఓపెనింగ్స్ సాధించిన హాలీవుడ్ సినిమా ఇదే కావ‌డం విశేషం.

పిల్లల కోసం మూవీకి వెళ్లిన పెద్దలు కూడా త్రీడీలో సినిమా చూసిన తర్వాత వావ్ అనేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తున్నా..లయన్ కింగ్ తన మార్క్ వసూళ్లను రాబడుతోంది. నాని, ర‌విశంక‌ర్, జ‌గ‌ప‌తిబాబు లాంటి స్టార్ల వాయిస్ తెలుగులో సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చింది.