‘బిగ్ బాస్ 3’… వెల్లువెత్తుతున్న స్కూఫ్‌లు..!
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా నిన్న స్టార్ మాలో అట్టహాసంగా మొదలైంది ‘బిగ్ బాస్ 3’. గత రెండు సీజన్స్‌తో పోలిస్తే.. ఈ సీజన్ ప్రారంభం కాకముందే పెద్ద సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఈ షో మొదలైన మొదటి రోజుకే సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల పేరుతో ఆర్మీలు రచ్చ చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ‘బిగ్ బాస్’ షోపై మేమెస్, స్కూఫ్‌లు నెట్టింట్లో స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా ‘డిగ్ బాస్ 3.0’ అనే పేరడీ ప్రోగ్రామ్‌ను యూట్యూబ్ […]
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా నిన్న స్టార్ మాలో అట్టహాసంగా మొదలైంది ‘బిగ్ బాస్ 3’. గత రెండు సీజన్స్‌తో పోలిస్తే.. ఈ సీజన్ ప్రారంభం కాకముందే పెద్ద సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఈ షో మొదలైన మొదటి రోజుకే సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల పేరుతో ఆర్మీలు రచ్చ చేస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా ‘బిగ్ బాస్’ షోపై మేమెస్, స్కూఫ్‌లు నెట్టింట్లో స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా ‘డిగ్ బాస్ 3.0’ అనే పేరడీ ప్రోగ్రామ్‌ను యూట్యూబ్ ఛానల్ రూపొందించింది. దానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు ఆన్లైన్‌లో వైరల్ అవుతోంది.
మరోవైపు ఈ షోకి హోస్ట్‌గా నాగార్జునలా డూప్ తీసుకొచ్చిన ఆర్టిస్ట్.. ఆయన వాయిస్ ను ఇమిటేట్ చేయడం ఒక ఎత్తు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ, శ్రీముఖి, ప్రభాస్, కేఏపాల్, రాజ్ తరుణ్, రేణు దేశాయ్, పోసాని, సునీల్ వంటి స్టార్ సెలబ్రిటీస్ పోలికలు, బాడీ మ్యానరిజమ్స్ ఉన్న వాళ్ళతో పాటు టిక్ టాక్ స్టార్ ఉప్పల్ బాలుని కంటెస్టెంట్లగా దింపారు.