బిగ్ బాస్: శత్రువులుగా మారిన ఆ ‘మాజీ లవర్స్’

బిగ్ బాస్: శత్రువులుగా మారిన ఆ 'మాజీ లవర్స్'

హిందీ బిగ్ బాస్ మొదలై రెండు వారాలు మాత్రమే అయింది. కానీ అటు హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. ఇటు బయట షోపై వివాదాలు రోజురోజుకి సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రష్మీ దేశాయ్, సిద్ధార్థ్ శుక్లాలు మాత్రం ప్రతిరోజు ఏదో ఒక గొడవకు దిగుతుండటం.. ఫ్యాన్స్‌కు నచ్చట్లేదని చెప్పాలి. టాస్కుల్లో భాగంగా జరుగుతున్నాయో.. లేక బిగ్ బాస్ కావాలనే స్పైసీ కోసం పెడుతున్నాడో గానీ.. ఈ ఇద్దరూ మాత్రం బద్ద శత్రువుల […]

Ravi Kiran

|

Oct 17, 2019 | 2:04 PM

హిందీ బిగ్ బాస్ మొదలై రెండు వారాలు మాత్రమే అయింది. కానీ అటు హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. ఇటు బయట షోపై వివాదాలు రోజురోజుకి సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రష్మీ దేశాయ్, సిద్ధార్థ్ శుక్లాలు మాత్రం ప్రతిరోజు ఏదో ఒక గొడవకు దిగుతుండటం.. ఫ్యాన్స్‌కు నచ్చట్లేదని చెప్పాలి. టాస్కుల్లో భాగంగా జరుగుతున్నాయో.. లేక బిగ్ బాస్ కావాలనే స్పైసీ కోసం పెడుతున్నాడో గానీ.. ఈ ఇద్దరూ మాత్రం బద్ద శత్రువుల మాదిరిగా మారుతున్నారు.

మొదటి వారంలో ఇద్దరూ కూడా తమ మధ్య వచ్చిన మనస్పర్ధలను తొలిగించుకోవాలని ప్రయత్నించినా.. గత వారం బిగ్ బాస్ ఇచ్చిన కిచెన్ డ్యూటీస్ టాస్క్‌లో మళ్ళీ వీళ్ళ మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. రష్మీ తన తోటి కంటెస్టెంట్లయిన దేవోలీనా, సిద్ధార్థ్ డెయ్‌లకు.. ‘దిల్ సే దిల్ తక్’ షూటింగ్ సమయంలో సిద్ధార్థ్ శుక్లాతో రోజూ గొడవ పడుతూనే ఉండేదాన్ని అని చెప్పింది. అంతేకాకుండా అతడు తనను దూషించేవాడని కూడా చెప్పింది.

మరోవైపు బిగ్ బాస్ టికెట్ టూ ఫైనల్ రూపంలో కంటెస్టెంట్లకు ‘బిబి టాయ్ ఫ్యాక్టరీ’ టాస్క్ ఇచ్చాడు. సిద్ధార్థ్ శుక్లా, పరాస్‌లను కెప్టెన్లుగా నిర్ణయించి.. రెండు టీంలుగా విభజించాడు. ఇక ఈ టాస్క్‌లో కంటెస్టెంట్లు చాలా దారుణంగా, బోరింగ్ కలిగించేలా ఆడారని బిగ్ బాస్ మండిపడ్డాడు. అటు సిద్ధార్థ్ కూడా తన టీమ్‌మేట్స్‌కు క్లాస్ పీకాడు. ‘గెలుపే ధ్యేయంగా ఆట ఆడాలని.. అంతేకాక మనకంటూ మర్యాదను కూడా సంపాదించాలని’ భోదన చేశాడు.

ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లోని పరిస్థితులను గమనిస్తే.. కిచెన్ డ్యూటీస్‌తో పాటు అన్నింటిల్లో కూడా కంటెస్టెంట్లు రెండు గ్రూప్స్‌గా విడిపోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అటు రష్మీ దేశాయ్ సైతం తన మాజీ కో-స్టార్ సిద్దార్థ్ శుక్లా నిజస్వరూపాన్ని బహిర్గతం చేయాలనే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఇదంతా చూస్తుంటే.. ఈ మాజీ లవర్స్ ఇద్దరూ కూడా బయటికి శత్రువుల్లా వచ్చేలా కనిపిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu