Zodiac Signs: ఈ 5 రాశులవారికి పెళ్లంటే నూరేళ్ల పంట కాదు మంట.. అవేంటో తెలుసా.?
ఎంత ప్రయత్నించినా కూడా కొంతమంది జంటలు.. తమ వివాహ బంధాన్ని చివరి వరకు కొనసాగించలేరు. కొంచెం ప్రేమ.. కొంచెం ఇష్టం..
ఎంత ప్రయత్నించినా కూడా కొంతమంది జంటలు.. తమ వివాహ బంధాన్ని చివరి వరకు కొనసాగించలేరు. కొంచెం ప్రేమ.. కొంచెం ఇష్టం లేని చోట బంధం అనేది బలపడదు. బంధాన్ని బలంగా ఉంచాలంటే.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరి నమ్మకంతోనే బంధాన్ని ముందుకు కొనసాగించగలరు. ఇదిలా ఉంటే.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. పన్నెండు రాశులు.. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మరి వివాహాన్ని నూరేళ్లు పంటలా కాకుండా మంటలా కొనసాగించే ఆ రాశిచక్రాలు ఏంటో తెలుసుకుందాం..
మేషరాశి:
ఈ రాశివారికి కోపమెక్కువ. ఏ విషయంలోనైనా.. అది చిన్నదా లేదా పెద్దదా అనేది లేదు.. వీరిని రెచ్చగొడితే చాలు.. ఠక్కున కోపం తెచ్చుకుంటారు. ఇలాంటి వారికి పెళ్లి తర్వాత ఏవైనా గొడవలు తలెత్తితే.. వీరిని ప్రశాంతంగా ఉంచడం చాలా కష్టం. ఒకవేళ చివరికి వీరు శాంతించి.. క్షమాపణ చెప్పాలనుకున్నా.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. వీరిని భాగస్వాములు అస్సలు భరించలేరు.
మిధునరాశి:
ఈ రాశివారు తమ జీవితాంతం ఒకరితోనే కలిసి ఉండటానికి అస్సలు ఇష్టపడరు. వీరు తమ పనిలో పడి.. జీవిత భాగస్వామికి తగినంత సమయాన్ని కేటాయించరు. దీని ఫలితంగా వీరి వివాహ జీవితంలో గొడవలు తలెత్తుతాయి. భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతూపోతుంది. ఆ విషయం తెలుస్తున్నా కూడా.. ఈ రాశివారు దాన్ని సరిచేయాలని అనుకోరు.
కన్యారాశి:
రిలేషన్‌షిప్, వివాహం ఏదైనా కూడా ఈ రాశివారు ప్రతీ విషయంలోనూ పరిపూర్ణతను కోరుకుంటారు. ఈ అంశమే.. వీరి వివాహ బంధాన్ని బీటలు వారేలా చేస్తుంది. ఈ రాశివారిని చేసుకునే జీవిత భాగస్వామి.. ఆ అంశంతో విసుగు చెందుతుంది.
వృశ్చిక రాశి:
ఈ రాశివారు తమ జీవితంలో ఎవరికైనా చోటు ఇచ్చేందుకు.. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు. ఎక్కడ ఇతరులు తన మాటలకు లేదా చేష్టలకు బాధపడతారేమోననే భయంతో అందరికీ దూరంగా ఉంటారు. అయితే వీరు ఒక్కసారి కమిట్ అయితే.. భాగస్వామిని విడిచి దూరంగా ఉండలేరు. కానీ ఆధిపత్యం తానే చెలాయించాలని అనుకునే వీరి కోరిక.. వారి వివాహ బంధంలో గొడవలను రేకెత్తిస్తుంది.
మకరరాశి:
ఈ రాశివారికి పనే దైవం, ఎప్పుడూ తమ పని, వృత్తి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇక ఇదే వారితో సమయాన్ని గడపాలనుకునే వారి భాగస్వామిని చాలా నిరాశపరుస్తుంది. మకరరాశి వారు తమ భాగస్వామి భావాలను సరిగ్గా అర్ధం చేసుకోలేరు.