Weekly Horoscope: ఈ వారం ఈ రాశి వ్యాపారస్తులు లాభాలు పొందే అవకాశం .. మే 29 నుంచి జూన్ 14 వరకు రాశిఫలాలు..

Weekly Horoscope: ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా ఈ వారంలో ఏ పని మొదలు పెట్టాలన్నా సరే తమపై గ్రహ ప్రభావం ఎలా ఉంది అంటూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. తమ జాతకాన్నీ నామ నక్షత్ర ప్రకారం, లేక జన్మ నక్షత్ర ప్రకారం వారఫలాల(Weekly Horoscope) గురించి తెలుకోవాలనుకుంటారు...

Weekly Horoscope: ఈ వారం ఈ రాశి వ్యాపారస్తులు లాభాలు పొందే అవకాశం .. మే 29 నుంచి జూన్ 14 వరకు రాశిఫలాలు..
Weekly Horoscope
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 29, 2022 | 6:49 AM

Weekly Horoscope: ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా ఈ వారంలో ఏ పని మొదలు పెట్టాలన్నా సరే తమపై గ్రహ ప్రభావం ఎలా ఉంది అంటూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. తమ జాతకాన్నీ నామ నక్షత్ర ప్రకారం, లేక జన్మ నక్షత్ర ప్రకారం వారఫలాల(Weekly Horoscope) గురించి తెలుకోవాలనుకుంటారు. రాశిఫలాలు ఆధారంగా తమకు ఈ వారం రోజులు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో మే 29వ తేదీ ఆదివారం నుంచి జూన్ 14 వ తేదీ(శనివారం) వరకు ఈ వారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈ వారంలో తమ సమస్యలను తొలగించుకుంటారు. స్ఫష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది. లాభాలను అందుకుంటారు. ఇతరులపై ఆధార పడకుండా మానసికంగా బలమైన నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన పనులు నెరవేర్చుకునే విధంగా మంచి ఆలోచనలు చేస్తారు

వృషభ రాశి: ఈ రాశివారికి విశేషమైన గౌరవం లభిస్తుంది. కొత్తగా చేపట్టిన పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. ధన లాభం ఉంది. ఖర్చు చేసే విషయం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో పట్టు సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథున రాశి: ఈ రాశివారు కుటుంబానికి సంబంధించిన శుభవార్త వింటారు. ఉద్యోగ, వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఈ వారంలో సమయానుకూలంగా అడుగులు వేస్తే.. ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. కొన్ని వివాదాలు శుభఫలితాలను అందిస్తాయి. దైవ దర్శనం మేలు జరుగుతుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఉద్యోగంలో విశేషమైన కీర్తిని అందుకుంటారు. వ్యాపారంలో ఈ వారంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి. జీవితంలోకి పైకి వచ్చే ఆకాశాలను అందిస్తుంది. అనవసర వ్యయాన్ని అదుపు చేయాలి. అధిక శ్రమకు గురవుతారు. మానసిక శాంతి కోసం ఇష్ట దైవాన్ని స్మరించండి.

సింహ రాశి: ఈ రాశివారు మనసు పెట్టి పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారం మధ్యలో గ్రహ బలం విశేషంగా ఉంటుంది. పట్టుదలతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. మొహమాటంతో ఆర్ధికంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈ వారంలో ఎంత కష్ట పడితే అంత విజయం సొంతం చేసుకుంటారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ప్రారంభించిన పనుల్లో ఫలితాలను అందుకుంటారు. వివాదాస్పద పనులకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

తుల రాశి: ఈ రాశివారు శుభఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్తగా పని చేస్తే సత్పలితాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోవారు మంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. సమస్యలను అధిగమిస్తారు. అన్నివిధాలా అదృష్ట యోగం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి: ఈరాశివారు ఉత్సాహంగా ఉంటారు. శుభఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. వ్యాపార రంగంలోని వారు లాభాల బాట పడతారు. తోటివారి సహకారంతో పనులు చేస్తారు. ప్రణాళికతో ముందుకు సాగితే.. మంచి భవిష్యత్ సొంతమవుతుంది.

ధనస్సు రాశి: ఈ రాశివారు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారికీ శుభకాలం. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన లాభాలను పొందుతారు. కీలక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారాన్ని అందుకుంటారు. సులభంగా ఆటంకాలను అధిగమిస్తారు. కొత్త పరిచయాలు లభిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరతాయి. న్యాయం లభిస్తుంది.

మకర రాశి: ఈ రాశివారు ఉత్సాహంగా బాధ్యతలను పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు తీసికోవాల్సి ఉంటుంది. కాలం అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలా సహకారం లభిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి తగినంత ప్రోత్సాహం ఉంటుంది.

కుంభ రాశి: ఈ రాశివారికి ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఈ వారం ఆర్ధికంగా బాగుంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పట్టుదలతో పనిచేసి బంగారు భవిష్యత్ అందుకుంటారు. అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మీన రాశి: ఈ రాశివారు అభివృద్ధికి ఆర్ధిక స్థితికి అనుకూలం. సానుకూల దృక్పథంతో వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలోని వారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సహకారం లభిస్తుంది. అపార్ధాలు ఏర్పడే అవకాశం ఉంది.. ఓర్పుతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆనందాన్ని ఇచ్చే శుభవార్త వింటారు. అవసరానికి తగిన ధనం లభిస్తుంది.

Note: రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.